నాని సినిమాలొ సమంతా: తొలిసారిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో 

14:54 - January 13, 2019


నాగచైతన్యతో పెళ్ళితర్వాత కూడా గత సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు సమంతా.  ఈ ఏడాది కూడా అదే హ‌వాని కొన‌సాగించాల‌ని అనుకుంటుంది. ప్ర‌స్తుతం తన భ‌ర్త‌తో క‌లిసి మ‌జిలీ అనే సినిమా చేస్తున్న సామ్ త్వ‌ర‌లో నానీ నిర్మించబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనుందట. దీనికి కథ అందించింది ఎవరో కాదు. స్టార్ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. 
 
ఇప్పటికే నిర్మాత‌గా ఆ.! తో మంచి హిట్ కొట్టిన నాని ఇప్పుడు సీనియర్ అండ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథకి ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. దాంతో ఆ సినిమాని తానే నిర్మించాల‌ని భావించిన‌ట్టు తెలుస్తుంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పిన క‌థ‌లో ప్ర‌ధాన పాత్రధారిగా స‌మంత అయితే బాగుంటుంద‌ని నాని అనుకోవటం సమంతాని సంప్రదించటం, దానికి సామ్ ఓకే చెప్పేయటం కూదా జరిగిపోయాయట. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది. నాని- స‌మంత క‌లిసి ఈగ‌, ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు చిత్రాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నాని జెర్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.