కిస్ అయినా హగ్ అయినా  ఒకటే,  అది జస్ట్ యాక్టింగ్: చైతు లిప్ లాక్ పై సమంతా సమాధానం

14:06 - March 23, 2019

*నాగచైతన్య 'మజిలీ' సినిమాలో  లిప్ లాక్ వివాదం 

*సంధానం చెప్పిన సమంతా అక్కినేని 

*అది కేవలం నటనలో భాగం అని తేల్చేసిన సమంతా 

 

హాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్ అనేది సర్వసాధారణమైన విషయం అయితే ఇండియన్ సెల్యులాయిడ్ మాత్రం ఇప్పటికీ ఈ మూతిముద్దుల విషయంలో డైలమాలోనే ఉండిపోయింది. బాలీవుడ్ లోనూ ఇప్పటికీ ఈ లిప్ కిస్ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అదికేవలం నటన అని విధ్యాబాలన్ లాంతి హీరోయిన్ తేల్చేస్తే నేను మాత్రం పెదాల ముద్దులకి ఒప్పుకోను అంటాడు సల్మాన్ ఖాన్.

ఇక వాళ్ళ విషయం పక్కన పెడితే టాలీవుడ్ మాత్రం ఇంకా ఈ విషయాన్ని అంగీకరించలేకపోతోంది. ఇప్పటివరకూ స్ట్రేయిట్ తెలుగు సినిమాలో ఈ లిప్ లాక్ సన్నివేశాలు వేళ్ళమీద లెక్కపెట్టుకునేవే. వాటిమీద కూదా చాలా చర్చ జరిగింది. కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థించారు. కొందరి వాళ్ళ వాళ్ళ ఇష్టం అంటూ తప్పుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ లిప్ లాక్ టాలీవుడ్ లో చర్చలకు తెరతీసింది. 


తాజాగా నాగచైతన్య 'మజిలీ' సినిమాలో ఒక లిప్ లాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  ఈ సినిమాలో కొత్త హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ తో చైతు తన లిప్పులను గట్టిగా లాక్ చేస్తాడు. ఇప్పటికే ప్రోమోస్ లో ఈ కిస్ బయటకు రావడం.. వైరల్ కావడం జరిగిపోయాయి.   దీంతో కొంతమంది సమంతా ఫ్యాన్స్.. "పెళ్ళైన తర్వాత సమంతా చేస్తే తప్పు అన్నారు.. మరి పెళ్ళైన తర్వాత చైతు చేస్తే తప్పు కాదా? హీరోయిన్లకు ఒక రూల్.. హీరోలకు మరో రూల్ ఎలా చెప్తారు?" అంటూ చర్చ మొదలుపెట్టేశారు. వాళ్ళూ వెళ్ళ అభిప్రాయాలు ఎందుకూ అని డరెక్ట్ గా సమంతా నే అడిగేస్తే  చైతు - దివ్యాన్షలు లాగించిన దివ్యమైన లిప్ లాక్ గురించి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. అది కేవలం నటనలో భాగం మాత్రమే అంటూ తేల్చి పడేసింది. 

"నావరకూ నటించే సమయంలో కిస్ అయినా హగ్ అయినా  ఒకటే.  అది జస్ట్ యాక్టింగ్.  ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది నేనైనా.. చైతు అయినా యాక్టింగ్ లో భాగం మాత్రమే" అంటూ తేల్చేసింది.  తామిద్దరి మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని. ఒక యాక్టర్ గా ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు తమకు ఆ స్వేచ్చ ఉంటుందని తెలిపింది.