మళ్లీ మాయచేస్తారా!?

00:25 - August 18, 2018

           ఆ జంట ప్రేమ పెళ్లి తర్వాత కలిసి సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఆ ఇద్దరు జంటగా మూవీ చేయబోతున్నారు. మరి టైటిల్ ఏంటి..? డైరక్టర్ ఎవరు..? ఏ ప్రొడక్షన్లో తీయబోతున్నారనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. 
              నాగచైతన్య, సమంత ఏం మాయచేసావే సినిమాతో హిట్ ఫెయిర్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమైక జీవులై పెళ్లితో ఒక్కటయ్యారు. అపెళ్ళి తరువాత సమంతా సినిమాలు చేస్తుందా లేదా అన్న ప్రశ్నకు.. సమంత సినిమాలు మానదు అని సమాదానం వచ్చింది. పెళ్ళి తరువాత వీరిద్దరి కాంబినేషన్ మూవీకోసం అభిమాను లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు..
           ఎట్టకేలకు చైతు సమంత కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. నిన్ను కోరి’ మూవీ ఫే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది..‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ మూవీస్ లో జంటగా సందడి చేసిన చైతు, సమంతలు, ఇప్పుడు నటిస్తున్న మూవీ టైటిల్ పై రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి ‘మజిలి’ అన్న టైటిట్  కన్ఫాం అయినట్టు న్యూస్ హల్‌చల్‌ చేస్తోంది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. భార్యా,భర్తలయ్యాక కలిసి నటిస్తుండటంతో టాలీవుడ్ అంతా కళ్లింతలు చేసుకుని ఎదురుచూస్తోంది. మరి మళ్లీ మాయచేస్తారో లేదో చూడాలి.