ప్రియాంకా చోప్రాకు కౌంటర్‌ ఇచ్చిన సల్మాన్‌...

12:55 - March 22, 2019

ఇటీవల ప్రియాంక చోప్రా ఒక డేటింగ్ యాప్ ను లాంచ్ చేసింది. విభిన్నమైన ఆ యాప్ లో అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేయడం ఉంటుంది. అమ్మాయిలు ఫస్ట్ స్టెప్ తీసుకునేలా అందులో ఉంటుంది. బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ యాప్ కు మంచి గుర్తింపు దక్కింది. దాంతో యాప్ గురించి సల్మాన్ ఖాన్ వద్ద ప్రస్థావించడం జరిగింది. మీ ఫోన్ లో ప్రియాంక చోప్రా ప్రారంభించిన యాప్ ఉందా అంటూ విలేకరి ప్రశ్నించిన సమయంలో నాకు ఆ అవసరం లేదని అదేమిటో తనకు తెలియదు అని చెప్పాడు. అయినా పెళ్లి అయిన ఆమెకు ఇప్పుడు డేటింగ్ యాప్ తో పనేంటి అంటూ కౌంటర్ వేశాడు. అయితే ఇలా సల్మాన్‌ కౌంటర్‌ వేయడానికి కారణం వుందట! అదేంటో తెలుసుకుందాం. సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం  'భరత్' చిత్రంలో మొదట హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడం జరిగింది. షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో పాటు పెళ్లి అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే పెట్టుకున్న కారణంగా భరత్ సినిమాను చెప్పా పెట్టకుండానే ప్రియాంక చోప్రా వదిలేసింది. దాంతో సల్మాన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ప్రియాంక చోప్రా తన సినిమాను కాదని అవమానించిందని సన్నిహితుల వద్ద ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అంటూ ప్రచారం కూడా జరిగింది.  ప్రియాంక చోప్రాపై అప్పటి విషయానికి ఇప్పుడు కౌంటర్ వేశాడు.