మరో వివాదంలో చిక్కుకున్న సల్మాన్‌..

15:04 - April 10, 2019

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నాడు. ఆయన కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక గొడవతో ఆయన సహవాసం చేస్తూనే వచ్చాడు. ఆయన ప్రమేయం ఉన్నా లేకున్నా ఆయన మాత్రం విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. తాజాగా మరోసారి అటువంటి పరిస్థితే ఎదురైంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' చిత్రంలో నటిస్తున్నాడు. సల్మాన్ స్వయంగా ఆ చిత్రంను తమ్ముడితో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ను మద్యప్రదేశ్ లోని మండు కోటలోని జై మహల్ లో చిత్రీకరణ నిర్వహించారు. చిత్రీకరణ సమయంలో మహల్‌కు డ్యామేజ్‌ అయిందట. దీంతో పురావస్తు శాఖ వారు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. పురావస్తు శాఖ చట్టంకు లోబడి కాకుండా దబాంగ్ యూనిట్ సభ్యులు జాగ్రత్తలు తీసుకోకుండా మహల్ కు డ్యామేజీ అయ్యేలా షూటింగ్ చేశారని అందుకు సంబంధానం చెప్పాలంటూ నిర్మాత మరియు దర్శకుడికి పురావస్తు శాఖ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రభుదేవా ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు.సల్మాన్ ఖాన్ ఎంతో ఇష్టంగా చేస్తున్న 'దబాంగ్ 3' సినిమాకు మొదలైనప్పటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయినా కూడా సల్మాన్ ఖాన్ పట్టువదల కుండా ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటూ సినిమాను చేస్తున్నాడు. దబాంగ్ 2 ఫలితం కాస్త తేడా కొట్టిన నేపథ్యంలో మూడవ పార్ట్ ను ప్రభుదేవా దర్శకత్వంలో చేయిస్తున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంపై సల్మాన్ అభిమానులతో పాటు హిందీ సినీ వర్గాల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.