తెలుగులో రాబోతున్న సాయిపల్లవి "అతిరన్"

13:04 - March 23, 2019

మ‌ల‌యాళ చిత్రం "అతిర‌న్‌" తెలుగులో, త‌మిళంలో విడుద‌ల

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే అతిర‌న్‌

వేణు ఊడుగుల దర్శకత్వంలో రాబోతున్న "విరాటపర్వం 1992"

 

సాయిపల్లవి టాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మళయాళీ బ్యూటీ ఇటీవ‌ల ప‌డిప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. అయితే ఇంతకు ముందు సినిమాలంతగా ఈ చిత్రం పెద్ద‌గా అభిమానుల‌ని అల‌రించ‌క‌పోయిన‌, సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. 
   ఈ మధ్యనే ధనుష్ తో కలిసి చేసిన  "మారి" అనే త‌మిళ డబ్బింగ్ చిత్రంతోను ఇటీవ‌ల ప్రేక్ష‌క‌ల ముందుకు వ‌చ్చింది సాయి ప‌ల్ల‌వి.

ఇందులోను అద‌ర‌గొట్టింది. కానీ ఈ సినిమాకూడా తెలుగు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సినిమాల జయాపజయాలతో సంబందం లేకుండా సాయిపల్లవి మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. ఇప్పుడు నీదీనాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రాబోతున్న "విరాటపర్వం 1992" లో రానా సరసన నటిస్తోన్న సాయిపల్లవికి తెలుగునాట ఉన్న  క్రేజ్ దృష్ట్యా ఆమె న‌టించిన మ‌ల‌యాళ చిత్రం అతిర‌న్‌ని తెలుగులో, త‌మిళంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 

   రొమాంటిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే చిత్రాన్ని వివేక్ తెర‌కెక్కించ‌గా ఫాహ‌ద్ ఫాజిల్‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. నిర్మాణ సంస్థ సెంచ‌రీ ఫిలిమ్స్ అతిర‌న్ చిత్రాన్ని మూడు భాష‌ల‌లో ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తుంద‌ట. సో విరాటపర్వం కన్నా ముందే ఇంకోసారి సాయిపల్లవిని తెరమీద చూడొచ్చన్న మాట.