కొంచెం లేటైనా..తేజూకి మంచి విషియాలు తెలిశాయట!

16:13 - February 16, 2019

మెగా మేనల్లుడిగా తెరకు పరిచయమైనా తనదైన స్టైల్ గ్రెస్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ సుప్రీమ్ దాకా సాఫీగానే సాగింది.  సుప్రీమ్ బ్లాక్ బస్టర్ తో ఇరవై కోట్ల మార్కెట్ అందుకున్న తేజు ఆ తర్వాత ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు డిజాస్టర్లతో తన ఉనికినే సవాల్ చేసుకునే దాకా తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం తేజూ గెటప్‌ మార్చుకుని తిరుమల కిషోర్ దర్శకత్వంలో చిత్రలహరికి రెడీ అయ్యాడు. తన గత ఫెయిల్యూర్స్ గురించి తేజుకు మంచి క్లారిటీ ఉందట. పేపర్ మీద చదివినప్పుడు దర్శకుడు చెప్పినప్పుడు ఇవే కథలు బాగా అనిపించాయని కానీ అవి సినిమాలుగా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయి అనే జడ్జ్ మెంట్ విషయంలో తాను వేసిన తప్పటడుగుల వల్లే ఇలాంటి ఫలితాలు చవిచూడాల్సి వచ్చిందని చెప్పుకున్నాడు తేజుకి మొత్తానికి మంచి విషయాలే తెలిసాయి కానీ కొంత లేట్ అయ్యింది. నిజానికి సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా చేసినవాటిలో అధిక శాతం పేరున్న దర్శకులతో చేసినవే. వివి వినాయక్ కరుణాకరన్ ఇలా ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్ళే అందరూ. మొత్తానికి ఇప్పుడు మెచ్యూరిటీ గురించి తెలిసి వచ్చింది అంటున్నాడు చిత్రలహరిలో గట్టి విషయమే ఉన్నట్టుంది. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిన్ మెంటల్ మదిలో ఫేమ్ నివేతా పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రలహరి ప్రస్తుతానికి ఏప్రిల్ మూడో వారం రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు.