కారు ఎక్కనున్న చేవెళ్ళ చెల్లెమ్మ?: టీఆరెస్ లోకి సబితా ఇంద్రారెడ్డి సహా మరికొంతమంది ??

12:06 - January 12, 2019

చేవెళ్ళ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడి ఉన్న కాలం లో చేవెళ్ళ నియోజక వర్గానికి ఒక ప్రత్యేకథ ఉండేది. ప్రచారం అక్కడినుంచే మొదలు పెట్తటం ఆయన సెంటిమెంట్ అంతే కాదు మహిళా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గం కూడా అదే. చేవెళ్ళ చెల్లెమ్మ అన్న పేరు కూడా వైఎస్ సోదరిగా ఆమెను గుర్తించటం వల్లనే. కాంగ్రెస్ పార్టీలో  అత్యంత నమ్మకమైన కీలకమైన వ్యక్తిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి  కాంగ్రేస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు హోం మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.. కానీ పరిస్థితి మారిపోయింది. వైఎస్ మరణం, తెలంగాణా రాకతో కాంగ్రేస్, తర్వాత వచ్చిన వైసీపీ రెండూ తెలంగాణా రాష్ట్రంలో దాదాపు గల్లంతు కావటం, కాంగ్రేస్ లో ఉన్న సీనియర్ లీడర్లంతా పరస్పరం కొట్లాటల్లో మునిగిపోవటంతో సబితా ఇంద్రారెడ్డి దాదాపుగా ఒంటరి అయిపోయారు. 

 బహుశా అందుకే ఆమె మళ్ళీ వెలుగులోకి రావటానికి పావులు కదుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం సబితా ఇంద్రారెడ్డి కాంగ్రేస్ ని వీడి టీఆరెస్ లోకి రానున్నారు. ఇప్పుడు ఈ అంశం అంశం రాజకీయంగా హాట్ టాపిగ్గా మారుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ హోంమంత్రి  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు పేర్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని, ఆ తరువాత మరికొద్దిమంది రెండో విడతలో టీఆర్ఎస్ లో చేరతారని చెబుతున్నారు.  

             మొదటి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని - ఏ కారణం వల్ల అయినా ఆ చాన్స్ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం టికెట్ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్ కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది టీఆర్ ఎస్ వర్గాల నుంచి అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని కార్తీక్ రెడ్డి ఆశించినా పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అది సాధ్యపడలేదు. చెవేళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డికే అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితారెడ్డి టీఆర్ ఎస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
  
అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. వీరిద్దరే కాకుండా  భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య - పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి,  నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్ కూడా టీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరకంగా మరికొంత మంది కూడా టీఆరెస్ లోకి వచ్చేస్తే కంగ్రెస్ పార్తీ కూడా ఇక్కడ గల్లంతయి పోతుందేమో..