శబరిమలలో చరిత్ర సృష్టించిన మహిళలు...

11:07 - January 2, 2019

శబరిమలలో మహిళలు అనుకున్నది సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్నో ఒడిదుడుకులు, తిరస్కారాల తర్వాత ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత మొదటిసారి మహిళలు అయ్యప్ప ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ ప్రవేశం చేసిన ఇద్దరు మహిళలు కూడా 50 సంవత్సరాలలోపు వాళ్లే కావడంతో కోర్టు ఉత్తర్వులను అమలు జరిపినట్లైంది. పోలీసుల సాయంతోనే వాళ్లు ఆలయంలోకి వెళ్లడం విశేషం. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు ఈ తెల్లవారుజామున 3.45 గంటలకు ఆలయంలోకి వెళ్లారు. ఇటీవల వీళ్లు ఒకసారి విఫలయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు. నిన్న మహిళా సంఘాలు కేరళ వ్యాప్తంగా మానవహారం నిర్వహించిన తర్వాత ఈ ప్రవేశం జరిగినట్టు తెలుస్తుంది. తెల్లవారుజామున కావడంతో భక్తుల నుంచి వ్యతిరేక రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు భక్తుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.