మూడో మహిళకూ దర్శనం ఇచ్చిన అయ్యప్ప:నిన్న సాయంత్రమే ఆలయంలోకి శశికళ

11:44 - January 4, 2019
ఇప్పటికిప్పుడు ఇండియా మొత్తానికీ హట్ టాపిక్ శబరిమల. ప్రాచీన దక్షిణ భారత ఆలయాల్లో ఒకటిగా. కేరళ గవర్నమెంట్ కి భక్తి టూరిజం ద్వారా ఆదాయన్ని తెచ్చేదిగా మాత్రమే ఉన్న ఈ ఆలయం. ఇప్పుడు మహిళల ప్రవేషం అనే కొత్తగా వచ్చిన అంశంతో ఒక్కసారిగా ప్రధానవార్తల్లోకి వచ్చి చేరింది.
మొదట్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చినా నెమ్మదిగా ఇక ఆ పరిస్థితి చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మహిళల ప్రవేశం సంచలనానికి దారి తీసింది. దీంతో ప్రధాన అర్చకుడి నిర్ణయం మేరకు బుధవారం ఉదయం శబరిమల ఆలయాన్ని మూసివేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత శబరిమల ఆలయాన్ని తెరిచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతినిచ్చారు.బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు గతంలోనూ ఒకసారి  ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు. నిన్న మహిళా సంఘాలు కేరళ వ్యాప్తంగా మానవహారం నిర్వహించిన తర్వాత ఇప్పుడు పోలీసులు, ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కొందరు యూనిఫాంలో ఉన్న పోలీసులు, మఫ్తీ పోలీసులు వారిని స్వయంగా ఆలయ గర్భ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారం.శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. అటు టీవీ చానెళ్ళలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఇదే చర్చ. దేశం మొత్తానికీ ఇప్పుడిదే ప్రధాన సమస్య అన్నంతగా మారిపోయిన "ఆలయంలోకి ఆడవాళ్ళు" అనే విషయం ఇప్పుడిక మామొలువిషయంగా మారిపోనున్నట్టే ఉంది. ఎందుకంటే నిన్నటి ఇద్దరు మహిళల ప్రవేశానికే  దేశం మొత్తం ఊగిపోతూంటే ఇప్పుడు తాజాగా మరో 46 ఏళ్ల మహిళ ఒకరు గురువారం రాత్రి స్వామి అయ్యప్పను దర్శించుకున్నారు.  సదరు మహిళలను శ్రీలంకకు చెందిన శశికళగా గుర్తించారు. పాస్‌పోర్టులో పేర్కొన్న దాని ప్రకారం ఆమె పుట్టిన తేదీ 1972 డిసెంబర్ 3 గా ఉంది. ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా ‘‘18 పడి మెట్లు’’ ఎక్కిందని, గర్భగుడిలో పూజలు చేసిందని చెబుతున్నా . అయితే శశికళ పదునెట్టాంబడి అనే పద్దెనిమిది మెట్లు ఎక్కిందా లేదా అన్న విషయం లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ‘‘శశికళతో పాటు ఆమె బంధువులు కూడా వచ్చారు. సాయంత్రం 9.30కి దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి 11 గంటలకల్లా క్షేమంగా పంపకు చేరుకున్నారు...’’ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
 
 పోలీసు పర్యవేక్షణలో కొనసాగే ఎలక్ట్రానిక్ క్యూ పద్ధతిలో ఆమె దర్శనం చేసుకున్నారనీ..  దర్శనం కోసం ఆమె ముందుగానే బుకింగ్ చేసుకున్నారనీ అధికారులు తెలిపారు.  వయసుకు సంబంధించిన వివరాలు కూడా ముందే పంపారని పేర్కొన్నారు. తాను మెనోపాజ్‌కు చేరుకున్నానంటూ ఓ మెడికల్ సర్టిఫికెట్‌ను సైతం ఆమె పోలీసులకు సమర్పించినట్టు సమాచారం. కాగా శశికళ, ఆమె బంధువులు ఆలయానికి వస్తున్నట్టుగానీ, ఆమెకు భద్రత కల్పిస్తున్నట్టుగానీ ఎవరికీ తెలియకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి భద్రత కల్పించేందుకు పోలీసులు, మహిళా పోలీసులు మఫ్టీలో వెళ్లినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు