ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి అసలు విషియం చెప్పిన రాజమౌళీ

17:22 - March 14, 2019

ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ కొన్ని కాదు చాలా సందేహాలకు చెక్ పోస్ట్ లాగా పని చేసింది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో రాజమౌళి ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఇవ్వడంతో అందరూ తమ కొచ్చిన డౌట్స్ అన్ని తీర్చేసుకున్నారు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్స్‌పై వున్న డౌట్స్‌ అన్నీ తొలగిపోయినాయట. వివరాల్లోకి వెలితే... మీడియా సమావేశంలో  బాహుబలి తరహలో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉంటుందా అనే ప్రస్తావన వచ్చింది. దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ బాహుబలి కథ పరంగా చాలా పెద్దది కాబట్టి రెండు భాగాలూ తీయాలని ముందే అనుకున్నామని అంతే తప్ప ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యింది కాబట్టి సెకండ్ పార్ట్ తీయలేదని చెప్పాడు. అయితే ఆర్ ఆర్ ఆర్ లో అంత స్పాన్ లేదని కేవలం ఒక్క భాగం మాత్రమే ఉంటుందని కొనసాగింపుకు ఛాన్స్ లేదని తేల్చేశాడు. ప్రస్తుతానికి సీక్వెల్ లేదనే నిజం తెలిసిపోయింది కాబట్టి ఆర్ ఆర్ ఆర్ రెండో భాగం ఉండవచ్చేమో అనే అనుమానాలకు సెలవు పాడొచ్చు. సో క్లైమాక్స్ విషయంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. రాజమౌళి చెప్పినట్టు హీరోల పాత్రలు అల్లూరి సీతరామరాజు కొమరం భీంలే అయితే వాళ్ళ కథలు ప్రాణ త్యాగంతో ముగుస్తాయి. మరి ఆర్ ఆర్ ఆర్ లో కూడా అలాగే ప్లాన్ చేశారా అనే మాటను మాత్రం జక్కన్న దాటవేశాడు. ఇది వాళ్ళ చరిత్ర కాదు కాబట్టి ఎలా ముగించాలి అనే విషయంలో తనకు స్వేచ్చ ఉంటుందని ఇద్దరిని బాలన్స్ చేసి తీయడం గురించి తనకు పూర్తి క్లారిటీ ఉందని స్పష్టత ఇచ్చేశాడు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలియా భట్ పాత్రల గురించి సమాచారం ఇచ్చిన రాజమౌళి ఇంకొన్ని మాత్రం గుట్టుగా దాచాడు.