ఆర్‌ఆర్‌ఆర్‌ సెకండ్‌ షెడ్యూల్‌: వారి పాత్రలు ఇవేనట!...

11:52 - January 22, 2019

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించిన ఈ చిత్రం.. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనంతరం కొంత బ్రేక్ తీసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ను నిన్నటి(సోమవారం) నుంచి ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని హీరోల పాత్రలపై అనేక కథనాలు హల్‌చల్ చేశాయి. తాజాగా మరో కథనం ఫిలింనగర్‌లో చెక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అడవి దొంగగా ఆయన పాత్ర సాగుతుందని.. ఎన్టీఆర్‌ను పట్టుకునే పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.