ఆర్‌ ఆర్‌ ఆర్‌ విషియాలు మార్చి 14న తెలియనున్నాయా...?

14:44 - March 12, 2019

నిజంగా ఉంటుందో లేదో కానీ ఈ నెల 14న రాజమౌళి ప్రెస్ మీట్ గురించి అప్పుడే మీడియా వర్గాల్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.  గతంలో బాహుబలి విషయంలో శ్రీదేవి ఇష్యూ ఎంత రచ్చ అయ్యిందో చూసాం. తాను ఒకటి చెబితే మీడియా మరో అర్థాన్ని తీయడంతో ఏకంగా శ్రీదేవి దృష్టిలో అనవసరంగా తాను బ్యాడ్ అయ్యాననే ఫీలింగ్ రాజమౌళికి ఉందని ఆయన సన్నిహితులు చెప్పేవారు. ఇప్పుడు కూడా అలాగే...తానుగా ఏమి చెప్పకపోయినా ఆర్ ఆర్ ఆర్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో ఏదో ఒకటి స్పందించకపోతే ఇవి డ్యామేజ్ చేసేలా ఉన్నాయని ఈ ఆలోచన చేసినట్టు సమాచారం. అంతేకాదు శ్రీదేవి విషియంలో జరిగినట్టే ఇప్పుడు అలియా భట్ విషయంలో కూడా సరిగ్గా అలాంటి పరిణామమే జరుగుతుండటం చూసి జక్కన్న వెంటనే రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఒకవేళ మార్చ్ 14 మీడియా మీట్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు ఏ విషయాలు షేర్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కోల్కతా షెడ్యూల్ తో పాటు ఇప్పటిదాకా జరిగిన ప్రోగ్రస్ ని వివరించి స్టోరీ లైన్ ని సైతం లైట్ గా రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. ఇదే మీట్ లో హీరోయిన్ల గురించి క్లారిటీ ఇవ్వకపోవచ్చు అనేది మరో టాక్.  గతంలో మర్యాదరామన్న-మగధీర-బాహుబలి-ఈగ అన్నింటికీ రాజమౌళి ఇదే ఫార్ములా వాడాడు. కాకపోతే ఆర్ ఆర్ ఆర్ కు ఇది మరీ త్వరగా అవుతుంది  అంతే తేడా. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి చిన్న వార్త కూడా హాట్ గా మారుతున్న తరుణంలో ప్రెస్ మీట్ అంటే సినిమా రేంజ్ హడావిడి వచ్చేలా ఉంది.