లక్ష్మీస్ ఎన్టీఆర్ :ఈ రోజు సాయంత్రమే సర్ప్రైజ్ ఇవ్వనున్న వర్మ

11:31 - January 18, 2019

తెరమీద హీరోగా వెలిగిన ఎన్టీఆర్ జీవితాన్ని అదే తెరమీద చూడాలని ఎదురు చూసిన అభిమానుల కోరిక "కథానాయకుడు" తో తీరిపోయింది. కలెక్షన్ల పరంగా అంతంత మాత్రమే అనిపించుకున్న ఈసినిమా రామారావు గారి అభిమానులకు మాత్రం ఆనందాన్నే ఇచ్చింది. ఇక ఇప్పుడు కథా నాయకుడు కి సీక్వెల్గా రాబోతున్న "మహానాయకుడు" కన్నా ఇప్పుడు అమందరి దృష్టీ రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" మీదనే ఉంది. దానికి తగ్గట్టుగానే పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసినట్టున్నాడు ఆర్జీవి.  


       రామారావు గారు చనిపోయిన జనవరి 18న.. అంటే రేపు ఆయన వర్ధంతి సందర్భంగా సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం పోసుకోబోతుంది" అని ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. అయితే శుక్రవారం ఆర్జీవీ ఏం చేయబోతున్నాడు..?  టీజర్ గానీ ట్రైలర్ గనీ ప్లాన్ చేసాడా అంటూ కొంత ఆసక్తినైతే క్రియేట్ చేసాడు.  ఆ ప్రకటన ఏంటో తెలియాలంటే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూడాల్సిందే మరి. అయితే ఆ పోస్ట్ కింద ఆర్జీవీ ట్వీట్‌‌కు ఓ రేంజ్‌లో కామెంట్స్ వస్తున్నాయి. కొందరు నిజం బూతులు వాడితే మరికొందరు ఆ బూతులువాడినోళ్లమీదనే మళ్ళీ కొన్ని బూతులతొ కొట్టుకుంటున్నారు. సినిమా గురించి చెప్పిన మాటకే ఇంత గొడవ అయితే మరి సినిమా బయటకి వస్తే???