మెగా "స్టార్ వార్"లో వర్మ ఎంట్రీ: నాగబాబు పై ఆర్జీవీ ట్వీట్

05:44 - January 9, 2019

టాలీవుడ్ లో జరుగుతున్న స్టార్ వార్స్ తారా స్థాయిలోనే జరుగుతున్నాయి. గతకొన్ని రోజులుగా మెగా-నందమూరి వర్హాల మధ్య మాటల యుద్దం నడుస్తున్న నేపథ్యం లో. ఇప్పుడు తాజాగా వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరారు. మెగా బ్రదర్‌ నాగబాబు చేస్తున్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో  ఏరేంజులో దుమారం లేపుతున్నాయో తెలిసిందే. బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఓ ఇంటర్వ్యూలో నాగబాబు అనడం.. పైగా అప్పట్లో కమెడియన్‌ బాలయ్య అనే అతను నాకు తెలుసంటూ చురకలు అంటించడం తెలిసిందే. రాను రాను ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.

ఇది చాలదన్నట్టు  నాగబాబు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ "కథానాయకుడు"  పైనా తనదైన శైలిలో కవిత రాసి మరీ విమర్శలు గుప్పించారు. ఓ వైపు ఈ రచ్చ జరుగుతూ ఉంటే. నాగబాబు చేస్తున్న కామెంట్స్‌పై ఆర్జీవీ సోషల్‌ మీడియాలో తన స్టైల్లో కామెంట్‌ చేశాడు. " కామెంట్లో నన్ను మించిపోయారనే నా బాధ ఒక వైపు. తన స్టార్‌ బ్రదర్స్‌ని సమర్థించుకోవడంలో సూపర్‌ స్టార్‌అయ్యారని ఒకవైపు. ఒక కంట కన్నీరు. మరో కంట పన్నీరు. నాగబాబు గారు హ్యాట్సాఫ్‌. మీరు మీ బ్రదర్స్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో. నేనూ అంతే ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

    గతం లోనూ పవన్ కళ్యాణ్ పై విమర్షల గొడవలో "అక్కుపక్షి" అంటూ నాగబు అనటంతో తర్వాత "నాగ్ బాబూ సర్" అంటూ విమర్షలు చెసి మెగా బ్రదర్స్ తో మాటల గేమ్ ఆడిన వర్మ ఈ సారి "లక్ష్మీస్ ఎన్టీఆర్" వల్ల ఇటు మెగా ఫ్యామిలీ తోనూ అటు నందమూరి ఫ్యామిలీతోనూ ఏక కాలంలో వ్యతిరేకంగా ఉన్నాడు.  ఇప్పుడు కూడా ఇద్దరిలో ఎవరికీ మద్దతుగా లేకుండా రెండువర్గాలనూ వెటకారం చేస్తున్నట్టుగానే స్పందించటం తో ఇప్పుడు ఇరుపక్షాల అభిమానులూ వర్మ వెంటపడతారా అన్నది చూడాలి. ఎంతైనా వర్మ ని తిట్టుకుంటూ కూడా ఫాలో అవటం ఎప్పటినుంచో ఉన్నదే కదా.