రూ.50 కోట్ల ఆఫర్‌ను ఆర్‌జీవీ తిరస్కరించారా?

15:59 - March 16, 2019

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలకు అనుకున్న టైంకి ఇంకా వారం రోజు వ్యవది ఉంది. అయితే ఈ సినిమాని నిలిపివేయాలని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈసీ స్పందించి సినిమా ఆపడం జరగదని, సినిమా విడుదల తరువాత అందులో ఏమైనా అభ్యంతరకర విషియాలు వుంటే అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పింది. ఇదిలా వుంటే...ఇటీవలే ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత రాకేష్ చెప్పిన విషయాలు సంచలనాత్మకంగా మారాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ కనక ఆపేస్తే 50 కోట్లు ఇస్తామనే ఆఫర్ వర్మకు వచ్చిందని అయితే ఆయన అలా డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని తనకు తెలుసనీ రాకేష్ చెప్పడం విశేషం. వర్మ అప్పుల్లో ఉన్నాడని అందుకే తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తల గురించి ప్రస్తావిస్తూ అంత ఖర్మ వర్మకు పట్టలేదని క్లారిటీ ఇచ్చేశాడు. డబ్బు కోసం ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే వ్యక్తి వర్మ కాదని మరో సర్టిఫికెట్ ఇచ్చేశారు. కాగా  అసలు లక్ష్మిస్ ఎన్టీఆర్ 22కి వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ ఫాన్స్ ని వీడటం లేదు. వారం ముందుగానే ఆన్ లైన్ లో పెట్టాల్సిన అడ్వాన్స్ బుకింగ్ జాడ లేదు. అసలు థియేటర్లు ఓకే చేసుకున్నారా లేదా అనే సమాచారం సైతం లేదు.  మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తుందా అనేదే ప్రస్తుతానికి భేతాళ ప్రశ్న