నాపై కథనం రాసిన వారికి మినిమం సెన్స్‌ లేదు: రష్మిక

12:17 - February 2, 2019

'గీత గోవిందం' చిత్రంతో రష్మిక మందన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన విషయం తెల్సిందే.  కన్నడ సినీ పరిశ్రమతో పోల్చితే తెలుగు సినిమా పరిశ్రమలో పారితోషికం డబుల్ ఉంటుంది. అందుకే రష్మిక తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుందని అందరి అభిప్రాయం.  కన్నడ సినీ పరిశ్రమతో పోల్చితే తెలుగు సినిమా పరిశ్రమలో పారితోషికం డబుల్ ఉంటుంది. అందుకే రష్మిక తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుందని అందరి అభిప్రాయం.  హీరోయిన్ గా కెరీర్ ను ప్రసాదించిన కన్నడ సినీ పరిశ్రమను వదిలేయడంతో పాటు నిశ్చితార్థం కూడా చేసుకున్న వ్యక్తికి బ్రేకప్ చెప్పడంతో కన్నడ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆగ్రహం ఉందని చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం. కన్నడ సినీ పరిశ్రమను రష్మిక పట్టించుకోవడం లేదని దాంతో కన్నడ పరిశ్రమ మొత్తం కూడా రష్మికపై చాలా కోపంగా ఉన్నట్లుగా  తాజాగా ఒక మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఆ కథనంపై రష్మిక స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించింది. కన్నడ సినీ పరిశ్రమ కోపంగా ఉందనే విషయం ఎవరు చెప్పారు నేను అడిగేది తప్పుగా తీసుకోవద్దు... జస్ట్ ఇంట్రెస్ట్ తో తెలుసుకోవాలని అడుతున్నాను. నాపై కన్నడ సినీ పరిశ్రమ మొత్తం కోపంగా ఉందా? ఈ కథనంతో మీకు మినిమం సెన్స్ లేదని అనిపిస్తోంది. కన్నడ సినీ పరిశ్రమ నాపై కోపంగా ఉంది అంటే నేను నమ్మను. ఒక వేళ నిజంగా కోపంగా ఉంది అంటే మీరు నాకు మీరు కోపానికి ప్రూఫ్ చూపించండి అంటూ రష్మిక ప్రశ్నించింది. రష్మిక చేసిన వ్యాఖ్యలను చూసిన కొంతమంది...ఆ కథనం రాసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా రష్మిక సమాధానం ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఆమెపై  ప్రశంసలు కురిపిస్తున్నారు.