అభిమానుల ఎముకలు విరిచిన హీరో -

22:19 - February 5, 2019
మామూలుగా పాత పాప్ వీడియోల్లో సింగర్స్ పాడుతూ పాడుతూ ఒక్కసారిగా జనం లోకి దూకగానే అంతా మళ్ళీ హీరోని పట్టుకొని ఎగరేస్తారు. ఇది చూడటానికి బావుంతుంది. కానీ కాస్త తడబడ్డా ఎముకలు విరగటం ఖాయం. ఇప్పుడూ అదే అయ్యింది కాకుంటే హీరోగారి అత్యుత్సాహం పాపం అభిమానుల ఎముకలు విరగ్గొట్టింది. ఇంతకీ ఎవరా హీరో అంటారా? కొత్త పెళ్ళికొడుకు రణ్‌వీర్ కపూర్. '


 లాక్మె ఫ్యాషన్ వీక్‌లో భాగంగా రణ్‌వీర్ చేసిన ఓ పని కొందరు అభిమానులను గాయపరిచింది. తాను ఈ మధ్యే నటించిన "గల్లీ బాయ్"  సినిమాలోని "అప్నా టైమ్ ఆయేగా" పాట పాడుతూ ఆ జోష్లోకి వెళ్ళిపోయిన హీరో నిజంగానే పాప్ సింగర్ మాదిరిగా సడెన్‌గా స్టేజ్ కింద ఉన్న ఫ్యాన్స్‌పైకి దూకాడు. ఈ పరిణామాన్ని ఊహించని అభిమానులు షాక్ తిన్నారు. అతడు సడెన్‌గా పైకి దూకడంతో కొందరు కిందపడి గాయాల పాలయ్యారు.

అతన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించే పనిలో బిజీగా ఉన్న ఫ్యాన్స్ రణ్‌వీర్ అలా చేస్తాడని ఊహించలేదు. ఆ అభిమానుల్లో కొందరు యువతులు కూడా ఉన్నారు. వాళ్లు కిందపడిన ఫొటోలను కొన్ని పేపర్లు ప్రముఖంగా ప్రచురించాయి. రణ్‌వీర్ చర్యను కొందరు అభిమానులు ఖండించారు.  అయినా ఈ మధ్యనే కదా పెళ్ళయ్యింది మరీ ఇలాంటి పనులు చేయకూదదని ఎవ్వరూ చెప్పలేదా ఏమిటీ.. పాపం ఆ అభిమానులు.