నన్ను ఎన్టీఆర్‌ స్వర్గం నుంచి హెచ్చరించారు అందుకే అలా చేశాను: ఆర్‌జీవీ

15:24 - February 1, 2019

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ' లక్ష్మీస్ ఎన్టీఆర్ ' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే మరోసారి ఆర్‌జీవీ ఒక ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అదేంటంటే...ఎన్టీఆర్ తనను స్వర్గం నుంచి హెచ్చరించారంటూ ఆర్‌జీవీ  వరుస ట్వీట్స్ చేశారు.‘‘మహానాయకుడు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన 24 నిమిషాల్లోగా ' లక్ష్మీస్ ఎన్టీఆర్ ' ట్రైలర్‌ను విడుదల చేయాలని ఎన్టీఆర్ స్వర్గం నుంచి నన్ను హెచ్చరించారు. ఎన్టీఆర్ కేవలం ఆయన భార్యకు చెందిన  ఎన్టీఆర్ కేవలం ఆయన భార్యకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మాత్రమే ఆశీర్వదించారు. ఆయన కుమారుడు తీసిన ‘ ఎన్టీఆర్ కథానాయకుడు ’ సినిమాకు ఎన్టీఆర్ ఆశీస్సులు లభించలేదని స్పష్టమయింది. దీనికి నిదర్శనమే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ -మహానాయకుడు సినిమాలు ముఖాముఖి తలపడటం ’’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.