మన స్టార్‌ కిడ్స్‌ కలయిక చూస్తే...

17:00 - January 23, 2019

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల మధ్య మంచి సుహృద్భావ వాతావరణం కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఏఎన్ ఆర్ ల శకం తర్వాత మల్టీ స్టారర్ల తో పాటు హీరోల మధ్య వ్యక్తిగత కలయికలు బాగా తగ్గిపోయాయి. వాటిని బ్రేక్ చేస్తూ స్టార్ కిడ్స్ నడుం బిగించడం విశేషం. ఇక్కడ పిక్ చూసారుగా  మిస్టర్ మజ్ను అఖిల్ తో తారక్ చరణ్ లు కలిసి ఎంత చక్కని ఫోజు ఇచ్చారో. ఒకళ్ళ చేతులను మరొకరు పెనవేసుకున్న తీరు గట్టిగా బిగించి పట్టుకోవడం చూస్తే ఎంత బాండింగ్ ఉందో మళ్ళి వేరే చెప్పాలా. వీరి కలయికలకు  శ్రీకారం చుట్టింది రాజమౌళి ఆర్ఆర్ఆర్ అయినప్పటికీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు మిగలినవాళ్ళు కూడా ఒక్కొక్కరుగా దోస్తీ కలుపుతున్నారు. ఆ మధ్య భరత్ అనే నేను ఈవెంట్ తర్వాత అచ్చం ఇదే తరహాలో మహేష్ బాబు దిగిన మల్టీ స్టారర్ పిక్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మిస్టర్ మజ్ను వంతు వచ్చింది. తనతో అక్కినేని ఫ్యామిలీతో ఎంత గొప్ప అనుబంధం ఉందో ఆ వేడుక స్టేజి మీదే  చాటి చెప్పిన తారక్ మరోవైపు చరణ్ తో ఉన్న పాత స్నేహాన్ని ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకోస్తున్నాడు. తనతో ఒక్కసారి ఫ్రెండ్ షిప్ చేస్తే చాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న తరహాలో అందరిని కలుపుకుంటూ పోతున్నాడు చరణ్ . అందుకే శర్వానంద్-రానా-తారక్ ఇలా ఎవరిని కదిపినా స్నేహితుడిగా ఫస్ట్ చరణ్ పేరే చెబుతారు.