రాముడు, కృష్ణుడు పోగతాగలేదు : రామ్ దేవ్ బాబా

12:54 - January 31, 2019

కుంభమేళా నేపథ్యం లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ సాధువు. ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం రకరకాల సాధువులతో నిండిపోయింది. ఇక ప్రయాగ్ రాజ్ సంగతి చెప్పే పని లేదు దేశం నలు మూలలనుంచీ వచ్చిన నాగా సాధువులు, అఘోరాలూ లాంటి సన్యాసులతో నిండిపోయింది. మరి ఇంతమంది సాధువులు ఒక్క చోటికి చేరితే "స్టార్ సాధువు" అనిపించుకునే రామ్ దేవ్ బాబా వెళ్ళక పోతే ఎలా? 
అందుకే రామ్ దేవ్ బాబా కూడా కుంభ మేళాకి వెళ్ళాడు, అంతే కాదు అక్క‌డ జ‌రుగుతున్న కుంభ‌మేళాలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయ‌న వారితో ముచ్చ‌టించారు. సాధువులెవ‌రూ ధూమ‌పానం చేయ‌కూడ‌దంటూ రాందేవ్ వారిని కోరారు. రాముడు, కృష్ణుడి బాట‌ను మ‌నం అనుస‌రిస్తున్నామ‌ని, వాళ్లెవ్వ‌రూ ధూమ‌పానం చేయ‌లేద‌ని, మ‌నం కూడా ధూమ‌పానం చేయ‌కూడద‌ని వాగ్ధానం చేయాల‌ని అన్నారు.

ఓ మంచి కార‌ణం కోసం మ‌నం మ‌న ఇంటిని, త‌ల్లితండ్రుల‌ను వ‌దిలి వచ్చామ‌ని, అలాంట‌ప్పుడు స్మోకింగ్‌ను ఎందుకు వ‌దిలేయ‌లేమ‌న్నారు. కొంద‌రు సాధువుల వ‌ద్ద ఉన్న ధూమ‌పాన పైపులను తీసుకున్న బాబా రాందేవ్ వారితో ప్ర‌తిజ్ఞ చేయించారు. తాను నిర్మించ‌బోయే మ్యూజియంలో ఈ ధూమ‌పాన పైపుల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎంతో మంది యువ‌త పొగాకు మానేలా చేశాన‌ని, సాధువుల‌ను కూడా దానికి దూరంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని రాందేవ్ అన్నారు  కానీ రాముడూ కృష్ణుడూ సన్యాసం కూడా తీసుకోలేదు కదా..! ఈ లాజిక్ ఆయనకి ఏవరన్నా చెప్తే బావుండు