ఇది పాక్ ప్రధానిపై వర్మ స్టైల్ సర్జికల్ స్ట్రైక్ : డియర్ ప్రెసిడెంట్ అంటూనే...

23:36 - February 20, 2019

*ట్విట్టర్ వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై  వర్మ విమర్శల వర్షం

*డియర్ ప్రెసిడెంట్ అంటూనే వరుస చురకలు వేసిన దర్శకుడు 

*ఇది పాక్ ప్రధానిపై  వర్మ స్టైల్ సర్జికల్ స్ట్రైక్ అంటున్న నెటిజన్లు 

 

పుల్వామా దాడి జరిగిన నాటినుండీ భార్త పాక్ మధ్య అసలు యుద్దం కంటే మాటల, ట్వీట్ల యుద్దం భీకరంగా జరుగుతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సహా పలువురి సోషల్ మీడియా ఎకౌంట్ల మీద కామెంట్ల రూపంలో భారతీయుల దాడి మామూలుగా లేదు. అదే తరహాలో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ లమధ్య కూడా త్వీట్ వార్ నడిచింది. 


ఇదిలా సాగుతూందగానే ఇమ్రాన్ ఖాన్ మరో సారి కయ్యానికి కాలుదువ్వే మాటలని వాడుతూ ఒక ప్రకటన చేసారు.  "ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండని ఇమ్రాన్‌ భారత్‌ను హెచ్చరించాడు" దీనికి మరింత ప్రచారం కల్పించటానికి షాహి అఫ్రిదీ తన ట్వితర్ లో ఆ మాట్లని యథాతథంగా పోస్ట్ చేసాడు.  తమ ప్రధాని చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నయంటూ అతను వంతపాడాడు. ప్రధాని స్పీచ్‌ని రీట్వీట్ చేసిన అఫ్రిదీ ‘‘కచ్చితంగా క్రిస్టల్ & క్లియర్’’ అని పేర్కొన్నాడు. అయితే ఓ క్రీడాకారుడు అయి ఉండి.. యుద్ధానికి మద్దతు ఇవ్వడాన్ని కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం.. అఫ్రిదీ తన దేశభక్తిని చాటి చెప్పాడు అంటూ.. కామెంట్ చేశారు. 


 ఇదంతా ఒక ఎత్తైతే ట్విటర్ అనగానే మనకు గుర్తొచ్చే మనిషి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని తగులుకున్నాడు.  ఇమ్రాన్ సార్..! అంటూ తన స్టైల్ పలకరింపుతో ఒక్కొక్క ట్వీట్ వరుసగా వేస్తూ పోయాడు...  ట్విట్టర్ వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన విమర్శల వర్షం కురిపించారు.
 
వర్మ చేసిన ట్వీట్లు వరుసగా..

ట్వీట్#1.డియర్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
 సమస్యలు ఒక్కమాటతో పరిష్కారమైతే, మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు.
 
ట్వీట్#2: డియర్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్‌డీఎక్స్‌తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పించండి.. కావాలంటే మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇస్తాము.
 
ట్వీట్#3: డియర్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఒసామాలాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని ఆమెరికాకు తెలుస్తుంది.. కానీ మీకు తెలియదు. మరి మీది అసలు దేశమేనా? చెప్పండి సార్ ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు. మాకు కొంచం తెలివితేటలు నేర్పండి.
 
ట్వీట్#4: డియర్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ మీరు కూడా వాటిపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదు.
 
ట్వీట్#5: డియర్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదాలను మీరు బంతులుగా భావించి. పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ. ఇండియా పెవిలియన్‌లోకి పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా. లేదా బాంబ్స్ అనుకుంటున్నారా. కాస్త చెప్పండి సార్. 
 
ఇలా వరుస ట్వీట్లతో పాక్ ప్రధామీద విరుచుకు పడ్డాడు వర్మ. ఇక ఆ పోస్టులకింద రీట్వీట్లూ, కామెంట్లతో నెటిజన్లు ఇది వర్మ స్టైల్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ ఎగబడ్డారు..