మరో రాజకీయ తేనెతుట్టెను కదుపుతున్న వర్మ?: శశికళ బయోపిక్

16:22 - April 1, 2019

*వర్మ తర్వాతి ప్రాజెక్టు శశికళ బయోపిక్‌ 

*మరో వివాదాస్పద జీవిత కథ ఎంచుకున్న వర్మ 

*శశికళకు జైలు శిక్ష, మన్నార్‌గుడి మాఫియాలను హైలెట్‌ చేస్తూ...

 

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో వేడి పుట్టించిన రామ్‌ గోపాల్‌ వర్మ.. చాలాకాలం తరువాత విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ సాధించడంతో ఆర్జీవీ అభిమానులు కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.  ఓ పక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదంలో కొనసాగుతుండగానే తమిళ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన జయలలిత, శశికళ అంశాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

శశికళ బయోపిక్‌ను తీస్తున్నట్టు వర్మ అనౌన్స్ చేయడం దక్షిణాదిలో చర్చనీయాంశమైంది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ హిట్‌ కొట్టడంతో ఫామ్‌లోకి వచ్చిన ఆర్జీవీ.. మరో బయోపిక్‌ను టేకప్‌ చేశారు. తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

                                                            

శశికళ బయోపిక్‌ను ఏ అంశాల ఆధారంగా, ఏ కోణంలో రూపొందిస్తారు అనే విషయంపై రాజకీయ, సినీ విమర్శకుల్లో చర్చ మొదలైంది. ఈ చిత్రాన్ని కూడా వివాదానికి కేంద్ర బిందువుగా మలిచే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తున్నది. శశికళ పేరుతో రాబోతోన్న ఈ చిత్రంలో .. శశికళకు జైలు శిక్ష, మన్నార్‌గుడి మాఫియాలను హైలెట్‌ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కబోతోన్నట్లు సమాచారం.  

ఈ సినిమాకు లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ప్రేమ అనేది రాజకీయాలకన్నా డేంజర్ అంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు శశికళ కుటుంబాన్ని తమిళనాడులో  మన్నార్ గుడి మాఫియాగా పిలుస్తారు. జయలలిత అధికార పీఠం మీద ఉన్న పెత్తనం మొత్తం ఈమె చేసింది.

                                                         

అంతేకాదు జయలలిత హాస్పిటల్‌లో ఉన్నపుడు మన్నార్ గుడి మాఫియా ఏం చేసింది. అసలు శశికళ..జయలలిత ఎలా దగ్గరైంది. ఎలా అభిమాన పాత్రరాలైందనే విషయాన్ని ఈ సినిమాలో వర్మ చూపెట్టబోతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సోషల్‌ మీడియాలో తెలిపారు.

 

                                                      


ఇప్పటికే జయలలిత జీవితంపై ఒకేసారి మూడు నాలుగు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా తెరకెక్కుతోంది. అయితే ఇవన్నీ జయలలిథ సక్సెస్ని మాత్రమే ఆధారం చేసుకుని వస్తున్న కథలైతే వర్మ మాత్రం  జయలలిత జీవితంలో శశికళ ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో చూపెట్టబోయే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి కాంట్రవర్షల్ సబ్జెక్ట్ తర్వాత అంతకు మించిన వివాదాలున్న శశికళ, జయలలిత బంధంపై ‘శశికళ’ బయోపిక్‌ను రామ్ గోపాల్ వర్మ ఎక్కుపెడుతున్నాడు.