ప్రేమకు ఒక్కరోజేంటి? అంటున్న రకుల్‌...

15:23 - February 12, 2019

హీరోయిన్ అన్నంతనే ముద్దుముద్దుగా మాటలు చెప్పే ధోరణి ఒకప్పుడు ఉండేది. అయితే ఇప్పుడు మీడియా రోజులు పోయి సోషల్ మీడియా రాజ్యమేలుతున్న వేళ.. కొందరు హీరోయిన్లలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. మనసులోని మాటను చెప్పటానికి వారు జంకటం లేదు. అస్సలు మొహమాట పడటం లేదు. అలాంటి కోవకే చెందింది రకుల్ బేబీ. తాజాగా ఆమె ఆసక్తికరవిషయాన్ని వెల్లడించారు. హడావుడి చేసే ప్రేమికుల దినోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న క్వశ్చన్ ను సూటిగా అడిగేసింది. తనకు ప్రేమికుల దినోత్సవం మీద ఎలాంటి నమ్మకాలు లేవని తేల్చేసింది. ఇదంతా ప్రాశ్చాత్య సంస్కృతిగా కొట్టి పారేసిన ఆమె.. మనం వేడుక చేసుకోవటంలో అర్థం లేదంది. అయినా.. ప్రేమకు ఒక్క రోజేంటి? ఆ రోజంతా సంతోషంగా ఉండి.. గిఫ్టులు ఇచ్చుకుంటే సరిపోతుందా?  మిగిలిన ఏడాదంతా ప్రేమించాల్సిన అవసరం లేదా?  కమర్షియల్ గా ఇవన్నీ బాగుంటాయి. వాలెంటైన్స్ డే పేరుతో డబ్బులు ఎక్కువ ఖర్చు చేయటం.. షాపింగులు.. గిఫ్టులు అంటూ డబ్బును దుబారా చేయటమే కానీ మరొకటి ఉండదని తేల్చేసింది. ప్రేమికుల దినోత్సవం అంటూ హడావుడి చేసే దానికి ఆమె చెప్పిన మాటలు వింటే రకుల్ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.