రజనీ ఆ లాజిక్‌ మిస్సై తప్పుచేస్తున్నాడా?

16:41 - January 3, 2019

హీరోయిన్ కు వయసైపోతే కెరీర్ క్లోజ్ అయిపోతుంది. అదే హీరోకు వయసు పెరిగితే ఎక్స్ పీరియన్స్ వస్తుంది. క్రేజ్ పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్ ను రజనీకాంత్ మరిచిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఏజ్ తో సంబంధం లేకుండా తమ అభిమాన హీరో కుర్రాడిగా కనిపించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. ఓవైపు వయసుమళ్లిన హీరోలంతా విగ్గులు పెట్టుకొని - వైర్లు కట్టుకొని మేనేజ్ చేస్తుంటే రజనీకాంత్ మాత్రం తన వయసును దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటున్నాడు. అక్కడే వచ్చింది చిక్కంతా. యూత్ అంతా రజనీకాంత్ యంగ్ క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటారు. సూపర్ స్టార్ మాత్రం వశీ - కాలా - కబాలి అంటూ వృద్ధపాత్రలు పోషిస్తున్నాడు. వీటితో పోల్చుకుంటే ఉన్నంతలో పేట సినిమానే బెటర్ అనిపించక మానదు. అయితే ఇందులో కూడా ముసలి ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి.