లోక్‌సభ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్‌

14:24 - February 17, 2019

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సంచలన ప్రకటన చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇంతవరకు రజినీ పార్టీ పేరు ప్రకటించలేదు. కానీ ఓ పేరు పార్టీ పేరుగా చాలా పాపులర్ అయింది. అదే ' రజినీ మక్కల్ మండ్రం' .ప్రస్తుతం ఈ పేరుతోనే అభిమానులు, కార్యకర్తలు రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారు. ఇప్పుడు అదే పేరు లెటర్‌హెడ్‌తో లోక్‌సభ ఎన్నికలకు పార్టీ పోటీ చేసేది లేదని రజినీ కాంత్ ప్రకటించారు. అంతేకాదు....లోక్‌సభ ఎన్నికల్లో  ఎవరికీ మద్దతు ఇవ్వబోమని రజినీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తన మద్దతు ఉందంటూ...తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రజినీ ఇచ్చిన సమాధానంతో ఆయన అభిమానులు పరేషాన్ అవుతున్నారు.