రజనీకాంత్‌పై ఘాటైన విమర్శలు చేసిన కమల్‌ హాసన్‌

13:44 - February 18, 2019

ఎక్కడైనా ఫ్రెండ్స్ కానీ రాజకీయాల్లో మాత్రం కాదని ఇప్పటికే చాలాసార్లు ఫ్రూవ్ అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ విషియంలో కూడా మరోసారి రుజువయింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని రజనీకాంత్‌ చెప్పడం జరిగింది. దీనిపై కమల్‌ హాసన్‌...రజనీకాంత్‌పై ఘాటైన విమర్శలు చేశారు. వివరాల్లోకి వెలితే... కమల్ హాసన్ ఆల్ రెడీ పార్టీ పెట్టేశాడు. రజనీకాంత్ మాత్రం స్లో అండ్ స్టడీ సూత్రాన్ని నమ్ముకున్నాడు. త్వరలో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో.. తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని ప్రకటించాడు కమల్. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. కానీ రజనీ మాత్రం.. తమ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశాడు. తమ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని స్పష్టం చేశాడు. దీంతో...రజనీకాంత్‌పై విమర్శల జల్లు కురిపించిన కమల్‌ హాసన్‌... రజనీకాంత్‌ ఒక పిరికివాడు అని అన్నాడు. అంతేకాదు రజనీకాంత్‌ ఎప్పుడూ కూడా...సేఫ్‌  గేమ్ ఆడతాడని.. కాని తాను మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించాడు కమల్.  “ఒంటికి ఆయిల్ పూసుకుని - తొడలు కొట్టినప్పుడు కచ్చితంగా బరిలోకి దిగాలి. గెలిచో - ఓడో బయటకు రావాలి. కానీ నాకు ఇప్పుడు మూడ్ లేదు - రేపొస్తా - నీ అంతుచూస్తా అని సొల్లు కబుర్లు చెప్పకూడదు” అంటూ రజనీకాంత్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు కమల్ హాసన్. ఇదిలావుంటే...రజనీకాంత్ నిర్ణయంపై తమిళనాట కూడా విమర్శలు మొదలయ్యాయి. బీజేపీతో రజనీ కుమ్మక్కు అవ్వడం వల్లే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయట!.