మన సెన్సార్ బోర్డుకు నచ్చని "రక్తం": ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల సినిమా

23:23 - February 13, 2019

*రాజేష్ ట‌చ్ రివ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "ర‌క్తం"

*ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు, ఐదు నామినేషన్లు

*"ర‌క్తం" చిత్రానికి సెన్సార్ స‌భ్యుల అభ్యంత‌రాలు 

 

 

 

సామాజిక వేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ ఈ సినిమాను సమర్పణలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ "నా బంగారు తల్లి" డైరెక్టర్  రాజేష్ ట‌చ్ రివ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "ర‌క్తం" నక్స‌లైట్ బ్యాక్ డ్రాప్ లో హింసాత్మ‌క మార్గంలోనే నైతిక విలువ‌లు గురించిన చెప్పిన సినిమా, అంతర్జాతీయ వేదికలమీద ప్రదర్షించబడి అవార్డులని కూడా సాధించిన ఈ సినిమాకి ఇప్పుడు భారత దేశంలోనే చుక్కెదురయ్యింది. ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు, ఐదు నామినేషన్లకు ఎంపికైన ఈ చిత్రం సెన్సార్ స‌భ్యులని మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

అయితే రాజేష్ ట‌చ్ రివ‌ర్ త‌ను రూపొందించిన ర‌క్తం చిత్రానికి సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాల‌పై తీవ్ర అసంత్రుప్తి వ్య‌క్తం చేశారు. అంతర్జాతీయవేదికల మీద ఇన్ని అవార్డులు సాధించిన ఈ చిత్రంపై సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాలు సంత్రుప్తిక‌రంగా లేవ‌ని ఆయ‌న అన్నారు. "ఎలాంటి అస‌భ్య‌త లేకుండా, మాన‌వీయ కోణంలో చిత్రీరించిన ఈచిత్రానికి సెన్సార్ స‌భ్యులు చెప్పిన అభ్యంత‌రాలు స‌రైన‌వి కావు.

2(12) గైడ్ లైన్స్ ప్ర‌కారమే కట్స్ సూచించామని వాళ్లు సెక్సువల్ గా తప్పుదారి పట్టించే సన్నివేశాలున్నాయని సూచించిన గైడ్ లైన్స్ చ‌ద‌వ‌గానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇద్ద‌రు విప్ల‌వ‌కారుల మ‌ధ్య జ‌రిగే సీరియ‌స్ సంభాష‌ణ అది. వాళ్లు ఇచ్చిన గైడ్ లైన్స్ సెక్స్‌వ‌ల్ గా త‌ప్పుదారి ప‌ట్టించేదేంటో నాకు అర్థం కాలేదు. సామాజిక ప‌రివ‌ర్త‌న కోసం ర‌క్తం చిందించ‌డం అవ‌స‌ర‌మా? అనే సెన్సిబుల్‌ క‌థంశంతో సాగే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యలు చెప్పిన అభ్యంత‌రాలు చిత్ర క‌థ‌ను చిన్నాభిన్నం చేసేలా వున్నాయి. అందుకే తాను ట్రిబ్యున‌ల్ కు వెళుతున్నట్టు చెప్పారు.