జక్కన్న నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ రజనీతోనేనట!

12:39 - January 5, 2019

రజనీకాంత్ ఇక తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తారనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, అందుకు భిన్నంగా రజనీ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో రజనీ సినిమా ఉండే అవకాశం వుందన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఇదిలా వుంటే..రజనీ ఈ సంక్రాంతికి ఆయన 'పేట' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన మురుగదాస్ తో ప్లాన్ చేసుకున్నారు. విభిన్నమైన కంటెంట్ తో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించడానికి మురుగదాస్ సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఆ తరువాత సినిమాను మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్ తోనే చేస్తానని రజనీ ఆయనకి మాట ఇచ్చాడట. మురుగదాస్ .. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు పూర్తయిన తరువాత రాజమౌళితో రజనీ సినిమా వుంటుందేమో చూడాలి.