రాఫెల్‌ ఒప్పందంపై కాగ్‌ ఇచ్చిన నివేదికలో నిజమెంత?

13:08 - February 13, 2019

వివాదాస్పద రాఫెల్ ఒప్పందం సహా భారత వైమానిక దళంలో జరిగిన భారీ కొనుగోళ్లపై కాగ్ నివేదిక ఎట్టకేలకు రాజ్యసభకు చేరింది. యూపీఏ హయాంలో 126 యుద్ధ విమానాల కోనుగోలు కోసం చేసుకున్న ఒప్పందంతో పోల్చితే... ఎన్డీయే ప్రభుత్వం 2.86 శాతం తక్కువ ధరకు 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న 36 యుద్ధ విమానాల ఒప్పందంలోని వాస్తవ ధరలను కాగ్ వెల్లడించలేదు. ఇదిలావుంటే...రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూపీఏ ప్రభుత్వం హయాంలో చర్చలు జరిగిన దానికంటే రెట్టింపు ధరలకు కొనేందుకు కేంద్రం ఒప్పుకుందనీ.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షీ నాటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాఫెల్ ఒప్పందం ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకున్నారనీ... ఆయన కాగ్ నివేదిక వెలువరించేందుకు వీల్లేదంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.