పబ్జీలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు

13:25 - March 30, 2019

పబ్జీ ఆటల్లో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక చోట పబ్జీ అంటే వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పబ్జీని బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఈ ఆట వల్ల యువత భవిష్యత్తును సైతం నాశనం చేసుకుంటున్నారని, ఈ ఆట కోసం ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే క్రమంలో మరో ఇద్దరు యువకులు పబ్జీ ఆట ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. టెన్‌సెంట్ కంపెనీకి చెందిన ప్రముఖ ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ 'పబ్జీ' కి రోజురోజుకీ యువత బానిసలుగా మారుతున్నారు. ఈ పబ్జీ గేమ్ వల్ల ఎందరో యువకులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతుంది. ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో నాగేశ్‌ గోరే(22), స్వప్నిల్ అన్నపూర్నే (24) అనే ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు.

అక్కడ పబ్జీ ఆడితే జైలుకే ..అందుకే పబ్జీ ఆడిన 10 మంది అరెస్ట్ 
ఇద్దరు యువకులు ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీకొట్టింది. శనివారం సాయంత్రం సమయంలో ఖటకాళీ బైపాస్‌ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరకు వీరిద్దరూ బైక్‌పై వచ్చారు. ట్రాక్‌ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని 'పబ్‌జీ' ఆడతుండగా వారిని రైలు గుద్దడంతో చనిపోయారు. ఆటలో మునిగి పోయిన ఇద్దరూ అజ్మీర్‌-హైదరాబాద్‌ రైలు వస్తుండగా గమనించలేదు. రైలు డ్రైవర్‌ హార్న్‌ కొట్టినా వినిపించుకోలేదు. దూసుకొచ్చిన రైలు ఇద్దరినీ ఢీ కొట్టగా వారు అక్కడికక్కడే చనిపోయారు. పబ్జీ ఆటలో నిమగ్నమై ఇద్దరు యువకులు రైలు వచ్చేది గమనించకుండా రైలు గుద్దడంతో దుర్మరణం చెందారు.

ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ గేమ్ కి బానిసలైపోయి కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నం కూడా తినడం మానేసి గేమ్ ఆడుతున్నారు.

ఇప్పటికే అనేకమంది పబ్ జీ ఆడి మెంటల్ బాలెన్స్ కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే కాశ్మీర్ లో కూడా రోజురోజుకీ పబ్ జీ కి బానిసలైపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. జమ్మూకాశ్మీర్ లో జిమ్ లో పనిచేసే ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ఇప్పుడు పబ్ జీ గేమ్ హాస్పిటల్ పాలయ్యాడు.
10 రోజుల నుంచి తిండి, నిద్ర లేకుండా ఫిట్ నెస్ ట్రైనర్ ఫోన్ లో అదేపనిగా పబ్ జీ ఆన్ లైన్ గేమ్ ఆడాడు.

గేమ్ లో మొదటి రౌండ్ పూర్తి అయ్యే సమయానికి గేమ్ కి బానిసైపోయిన అతడు తనను తాను హింసించుకోవడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. గేమ్ కి బానిసైన అతడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడని బాధితుడికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ తెలిపారు. ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి అతడు వెళ్లిపోయాడని డాక్టర్ తెలిపారు. బాధితుడికి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ ఇలా పబ్ జీ గేమ్ ఆడి హాస్పిటల్ పాలైన వారిలో ఇది ఆరో కేసు అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.  పేరెంట్స్ తమ పిల్లలపై ఓ కన్నేసి ఉండాలని, ముఖ్యంగా గంటలపాటు ఒంటరిగా కూర్చొని మొబైల్స్ ని ఆపరేట్ చేస్తున్న సమయంలో వారిపై ఓ కన్నేసి ఉంచాలని డాక్టర్లు తెలిపారు.


 వెంటనే పబ్ జీ గేమ్ ని రాష్ట్రం, అదే విధంగా దేశంలో బ్యాన్ చేయాలని స్థానికులు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కోరారు. పబ్ జీ గేమ్ పై చైనా ఇప్పటికే తమ దేశంలో నిషేధించింది. దక్షిణ కొరియా వీడియో గేమ్ కంపెనీ బ్లూ హోల్ అనుబంధ కంపెనీ పబ్ జీ కార్పొరేషన్ ఈ ఆన్ లైన్ మల్టీప్లేయర్ గేమ్ ని డెవలప్ చేసింది.