తాగటానికి డబ్బులివ్వలేదని: పసిపాప గొంతు కోశాడు

11:03 - January 23, 2019

అలవాటు వ్యసనంగా మారితే మనిషిని ఎంతటి కిరాతకున్ని చేస్తుందోతెలిపే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మధ్యం మత్తుకోసం అయిదేళ్ల చిన్నారి గొంతు కోసాడో కసాయి. తాగటం కోసం ఆమె తల్లి డబ్బులు ఇవ్వకపోవటమే కారణంగా పసిపాప అని కూడా చూడకుండా ఇంతటి అఘాయిత్యానికి పాలపడ్డాడు. వివరాల్లోకి వెళితే... 

అచ్చంపేట చామర్రు రోడ్డులో నివాసం ఉంటున్న రాజ్యలక్ష్మీ అనే మహిళకు శివదుర్గ అనే ఐదేళ్ల కూతురు ఉంది. రాజ్యలక్ష్మీకి అదే ఊర్లో ఉంటున్న వీరయ్య అనే 30 ఏళ్ల వ్యక్తికి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మంగళవారం రాజ్యలక్ష్మీని తాగడానికి డబ్బులు కావాలని అడిగాడు వీరయ్య. అయితే అప్పటికే రోజూ డబ్బులు ఇస్తూ వచ్చిన రాజ్యలక్ష్మీ ఆరోజు మాత్రం డబ్బులు లేవని తెగేసి చెప్పింది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన వీరయ్య చిన్నారి శివదుర్గపై దాడి చేసి గొంతు కోశాడు. వెంటనే స్పందించిన స్థానికులు... వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రతహమ చికిత్స అందించిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కత్తి గొంతు నరాలకు హాని కలిగించకపోవడంతో ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరయ్య కోసం గాలిస్తున్నారు.