ఫ్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురి అరెస్టు: రాంగోపాల్ పేట్ స్టేషన్ కి తరలింపు

13:51 - April 13, 2019

*ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులతోపాటు 9 మంది ప్రజామేధావుల విడుదల డిమాండ్‌

*ప్రొఫెసర్ హరగోపాల్, ఎన్.వేణుగోపాల్ తో సహా పలువురు అదుపులోకి 

*వందలాది టీచర్స్ , ప్రజాస్వామికవాదుల అరెస్టు 

 

ప్రొఫెసర్‌ సాయిబాబా, వరవరరావులతోపాటు 9 మంది ప్రజామేధావుల విడుదల డిమాండ్‌తో  డెమాక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) ఈ రోజు TNGO భవన్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే పొద్దటి నుండి వందలాదిగా పోలీసులు మోహరించి, TNGO భవన్ హాల్ కు తాళాలు వేశారు. అంతేకాదు సమావేశానికి వస్తున్నపౌరహక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టుఎన్.వేణుగోపాల్ తో సహా వందలాది టీచర్స్ ను, ప్రజాస్వామికవాదులను అరెస్టు చేశారు.  

                                                        

. దేశవ్యాప్తంగా, వివిధ జైళ్ళలో మగ్గుతూ ఏ న్యాయ సహాయం అందని ఆదివాసీల గురించి, వారి న్యాయమైన పోరాటాలపై జరుగుతున్న అణచివేత గురించి మాట్లాడే సాయిబాబాను అరెస్టు చేసి మావోయిస్టు కేసు పెట్టి జీవిత ఖైదు విధించారు. ఏడాది క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తే, హైకోర్టులో చేసిన అపీల్ ఇప్పటికి కూడా విచారణకు రాలేదు. ఆయనను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, మేధావులు, రచయితలు, ప్రజాసంఘాలు మాత్రమే కాక, యునైటెడ్ నేషన్స్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ దగ్గరి నుండి వివిధ దేశాల హక్కుల సంఘాలు, మేధావులు పదే పదే చేసిన వినతులకు ప్రభుత్వం నుండి స్పందన లేదు. 

                                                

ఇదిలా ఉండగా గత ఆగస్టు 28న ప్రధానమంత్రి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో విప్లవ రచయిత వరవరరావును అరెస్టు చేసి పూణే జైలుకు తరలలించారు.వరవరరావుతోపాటు సాయిబాబా కేసు వాదిస్తున్న సురేంద్ర గార్లింగ్ ను కూడా అరెస్టు చేసారు. ఆయన విడుదల కోసం పోరాడుతున్న మరో ఏడుగురు ప్రసిద్ధ మేధావులను కూడా అరెస్టు చేసారు.

                                             

వీళ్ళందరి మీదా మొదట భీమా కోరేగాం అల్లర్లతో సంబంధం ఉందని కేసు పెట్టి, తర్వాత ఏకంగా ప్రధాన మంత్రి హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలతో మరో కేసు పెట్తారు అయితే ఆ లేఖలన్నీ నకిలీవని, అవి పోలీసుల సృష్టే అన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యం లో సాయిబాబా, వరవరరావులతోపాటు 9 మంది ప్రజామేధావుల విడుదల డిమాండ్‌తో జరుగుఇతున్న సమా వేశంలో ఉన్న వారందరినీ అరెస్ట్ చేసీన పోలీసులు రాం గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.