కన్నుగీటడం ఒక్కటే సరిపోదట!...

17:48 - February 4, 2019

కన్నుగీటు సుందరి.. వింక్ గర్ల్ ఇలా ఒక్కో భాషలో ఒక్కోపేరున్నప్పటికీ ఏ పేరుతో ప్రస్తావించినా ఆ పేరు వినగానే అందరికీ కేరళ భామ ప్రియా వారియర్ గుర్తొస్తుంది. ఈ భామకు యూత్ లో మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ తెలుగు ఫిలిం మేకర్స్ ఇంతవరకూ ఒక్క సినిమాకు కూడా తీసుకోకపోవడం చిత్రమైన విషయమే.ఒక చిన్న కన్ను గీటే వీడియోతో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించిన ప్రియా వారియార్ మొదటి సినిమా 'ఒరు ఆదార్ లవ్' ను తెలుగు 'లవర్స్ డే' పేరుతో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోనే ఆ కన్నుగీటే సీన్ ఉంది. నిజానికి ప్రియాను హీరోయిన్ గా తీసుకునేందుకు కొందరు తెలుగు మేకర్స్ ఆమెను సంప్రదించారట కానీ ఎవ్వరూ ఆమెకు అడ్వాన్సు ఇవ్వడం.. ఫైనలైజ్ చేయడం మాత్రం చేయలేదట.  ఆమె డేట్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అనే విషయం మాత్రం కనుకున్నారట. దీనికో కారణం ఉందట.  'లవర్స్ డే' సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రియా వారియర్ యాక్టింగ్ స్కిల్స్.. ఆమె పాపులారిటీ ఎలా ఉందో తెలుస్తుంది.. అప్పుడే ఆమె తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకుంటారట. ఈ లెక్కన ప్రియా వారియర్ కు తెలుగు సినిమా ఆఫర్ కు మధ్య వాలెంటైన్ డే పరిక్ష ఉందన్నమాట. ఇంత మరీ ఆలోచించడం ఎందుకంటే.. కొత్త హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ లా కాకుండా ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి రావడమే.