' లవర్స్‌ డే ' హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు...

12:32 - March 12, 2019

కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ పొందిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళంలో ' ఒరు అడార్‌ లవ్‌' ,తెలుగులో 'లవర్స్‌ డే ' పేరుతో ఆమె నటించిన తొలి సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకి అనుకున్నంత రీతిలో ఆధరణ దొరకలేదు. దీంతో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వాచ్చాయి. వివరాల్లోకి వెలితే... ఈ సినిమాలో ప్రియా ప్రకాష్‌ది మెయిన్ రోల్ కాదని, సినిమా విజయం సాధించక పోవడానికి ప్రియానే కారణమని , ఆమె కన్నుగీటిన వీడియో సంచలనం కావడం కారణంగా నిర్మాతలు బలవంతపెట్టి మరీ స్క్రిప్ట్ మార్పించారని తెలిపాడు దర్శకులు ఒమర్‌ లులు. న్యూరిన్ షరీఫ్ కూడా తనకు రావాల్సిన పేరు రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తాజాగా ఈ అంశంపై స్పందించిన ప్రియా ప్రకాష్ ఘాటుగా హెచ్చరించింది. అసలేం జరిగిందో చెబితే తనను విమర్శిస్తున్న వారి పరువు పోతుందని తెలిపింది. తాను ' కర్మ' సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబితుందని ప్రియా చెప్పింది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని ఆమె పేర్కొంది.