ప్రియాంకా గాంధీ వాద్రా, జనరల్ సెక్రటరీ: కాంగ్రెస్ బిల్డింగ్‌లో ప్రియాంకా ఆఫీస్

22:57 - February 5, 2019

ప్రియాంకా గాంధీ ఇప్పుడు కాంగ్రేస్ కి ఒక కొత్త ఉత్సాహం. గత కొన్నేళ్ళుగా కాంగ్రే కాంగ్రస్ సీనియర్లతో సహా అంతా కోరుకున్నట్టుగానే ప్రియాంకా పార్టీలోకి వచ్చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ గదిని కేటాయించారు.   అంతేకాదు గది బయట ఓ కొత్త నేమ్ ప్లేటు కూడా పెట్టారు. "ప్రియాంకా గాంధీ వాద్రా, జనరల్ సెక్రటరీ" అని ని రెండు ఇంటిపేరులని కలిపి మరీ రాశారు. గత నెలలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాను రాహుల్ నియమించిన విషయం తెలిసిందే.

యూపీ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్ చార్జ్ గా చేశారు. అయితే యూపీని మించి జాతీయ స్థాయిలో ఆమె పాత్ర ఉంటుందని రాహుల్ మంగళవారం స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే. కచ్చితంగా అది జాతీయ స్థాయి పాత్రే అని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం రాహుల్ తో ప్రియాంకా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గురువారం వివిధ రాష్ర్టాల ఇన్ చార్జ్ లు - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఆమె పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే లోక్ సభ ఎన్నికల వ్యూహాలను కాంగ్రెస్ రచించనుంది.

కాగా ఫిబ్రవరి 4వ తేదీనే ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. రాబోయే రోజుల్లో ఆమె ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజా ఏర్పాట్లు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఆమె పర్యటను మొదలుపెట్టనున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రియాంకా గాంధీ ఎప్పుడూ ప్రత్యక్షరాజకీయాల్లోకి రాలేదు. అప్పుడుప్పుడు మాత్రమే తల్లి సోనియాగాంధీ సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక ఎక్కేది కాకుంటే  తల్లితో కలిసి బహిరంగ సభల్లో పాల్గొనేది. కానీ కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ఎలాంటి పదవులను ఆమె నిర్వర్తించలేదు.

 అయితే ఈసారి ఎలాగైనా బీజేపీని మట్టికరిపించాలనే కృతనిశ్చయంతో కాంగ్రెస్ అనూహ్యంగా ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కేంద్రంలో ప్రభుత్వంను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం డిసైడ్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ ప్రియాంకా చరిష్మా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అది కాకుండా ప్రియాంకా గాంధీ ఇందిరా గాంధీని పోలి ఉండటంతో పార్టీకి కలిసొచ్చే అంశంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. చూడాలి మరి నాయనమ్మ లా ఉండే ప్రియాంకా ని చూసి జనం ఓట్లు వేస్తారా లేదా అన్నది.