కుక్కకి 36 లక్షల జాకెట్ : ప్రియాంకా చోప్రా కుక్క ప్రేమ

12:43 - January 24, 2019

కుక్కని పెంచుకోవటం కొందరికి రక్షణ విషయం, ఓ కాలక్షేపం, మరికొందరికి ఒంటరితనం నుంచి ఒక ఊరట కానీ సెలబ్రిటీలకు మాత్రం పెట్ ఉండటం ఒక స్టేటస్ సింబల్. ఎంతకుక్కైనా దానికీ ఒక బ్లడ్ ఉందీ, బ్రీడ్ ఉందీ కదా. అందుకే కొన్ని జాతుల కుక్కలను మాత్రమే సెలబ్రిటీలు పెంచుతూంటారు. కుక్కని కుక్కలా కాకుండా కింగు లా చూస్తారు. అదే కుక్క హాలీవుడ్ రేంజ్ అయితే? ఇంకా చెప్పాలా దానిది రాజభోగమే.. 


 ఇంతకీ ఇంతసోదీ దేనికంటారా? ప్రియాంకా చోప్రా ఈ మధ్య తను పెంచుకునే కుక్క కోసం ఓ చలి జాకెట్ కొందట. ఆమాత్రం దానికే మనం మాట్లాడుకుంటామా గానీ ఆ జాకెట్ ఖరీదు వింటేనే మన కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ జాకెట్ ఖరీదు అక్షరాలా 36 లక్షలు. తాజాగా ప్రియాంక చోప్రా త‌న పెంపుడు కుక్కకు రూ. 36 ల‌క్ష‌ల జాకెట్ వేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో షూటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ త‌న కుక్కను కూడా అక్క‌డికి తీసుకెళ్లింది. అక్క‌డ చలి ఎక్కువ ఉండ‌డంతో ఆ కుక్కకు జాకెట్ వేసి, ఫోటోలు తీసింది. అంత‌టితో ఆగ‌కుండా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఇంత చక్కటి జాకెట్‌ ఇచ్చినందుకు మోన్‌క్లేర్‌కు బ్రాండ్‌కు ధన్యవాదాలు తెలిపింది. కుక్క‌కి అంత ఖరీదయిన జాకెట్ వేయ‌డంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  


ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఆమె న‌టిస్తున్న‌ హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధం కాగా, ఏ కిడ్ లైక్ జేక్ చిత్రం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో యూట్యూబ్‌ వేదికగా ‘ఇఫ్‌ ఐ కుడ్‌ టెల్‌ యూ జస్ట్‌ వన్‌ థింగ్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.ఇలా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా వెళ్ళాక కూడా మరీ మామూలుగా ఉంటే ఏముందీ. అందుకే ఈ రేంజి అన్న మాట. ఇంతకీ కుక్క జాకెట్ కే 36 లక్షలంటే మరి ఆ కుక్క గారి రేటు???? అమ్మో ఆలోచించక పోవటమే మంచిది.