పవన్ నాకు తమ్ముడు: నా మీద భయంతో భీమవరం పారిపోయాడు

07:11 - March 24, 2019

*పవన్, నాగబాబులు నాకు తమ్ముళ్ళు 

*నా మీద భయంతో భీమవరం పారిపోయాడు 

*పవన్ కి ఓటు బ్యాంకు లేకనే పొత్తులు పెట్టుకుంటున్నాడు :కేఏ పాల్ 

 

2019 లోక్ సభ ఎన్నికలలో హడావుడి అంతా పక్కన పెడితే ఒక ప్రత్యేకమైన పార్టీగా కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కనిపిస్తోంది. ఏ రోజుకారోజు సరికొత్త వ్యాఖ్యలతో తనదైన స్టైల్ లో వస్తున్న పాల్ తన దృష్టి మొత్తం జనసేన మీదనే పెట్టారు. ప్రతీ సభలోనూ ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు తాజాగా పాలకొల్లు నుంచి నామినేషన్ వేసిన పాల్ తనతో పోటీ పడలేకనే పవన్ కళ్యాన్ భీమవరం పారిపోయాడని, అయినా తాను పవన్ ని తమ్ముడుగానే భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.  

‘పవన్ తొలుత పాలకొల్లు నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ నేను కూడా పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నట్టు తెలియగానే.. పారిపోయి భీమవరం నుంచి బరిలో దిగుతున్నాడని వ్యాఖ్యానించారు. అంతే కాదు పవన్ కళ్యాన్, ఆయన అన్నయ్య నాగబాబులు ఇద్దరూ తనకు తమ్ముళ్ళలాంటివారని సెతైరికల్ గా తేల్చిపడేసిన పాల్ తమ్ముడిపై అభిమానంతోనే పోటీ చేస్తున్నానని, పవన్‌కు పెద్దగా ఓటు బ్యాంక్ లేకపోవటం, ఓడిపోతానన్న భయంతోనే లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా శాంతి పార్టీకి ప్రతి ఊళ్లో 70 ఓట్లు ఉన్నాయని తాము గెలవటానికి ఆమాత్రం సరిపోతుందనీ చెప్పిన పాల్ సభ అయ్యెంత వరకూ తనదైనశైలిలో అందర్ని నవ్వించ్స్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.