Mr ప్రేమికుడు గా ప్రభుదేవా: ఇరవయ్యేళ్ళ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

10:04 - April 2, 2019

*మరోసారి హీరోగా ప్రభుదేవా
*ఈ సారి మిస్టర్ ప్రేమికుడు గా రానున్న కొరియో గ్రాఫర్ 
*మళ్ళీ ప్రేమికుడు మ్యాజిక్ రిపీట్ అవుతుందా? 

 

"ప్రేమికుడు" దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం కూడా ఇప్పటికీ ఆ సినిమా పాటలూ, ప్రభుదేవా డాన్స్ ఇంకా క్రేజీ ట్రాక్స్ లిస్ట్లోనే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తమిళంలో ‘కాదలన్’గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమికుడు’గా అనువాదమైంది. ఆ సినిమా తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా మరీ ఫ్రొఫేషనల్ యాక్టర్ గా మాత్రం రాణించలేకపోయాడు ప్రభుదేవా. కొరియోగ్రాఫర్ జాతీయ స్థాయిలో ఒకవెలుగు వెలిగాక నెమ్మదిగా దర్శకత్వం వైపు వచ్చి ఇటు తెలుగు, తమిళ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు తీసాడు. 


 అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్ లెంగ్త్ హీరోరోల్ లో కనిపించిన సినిమా "చార్లీ చాప్లిన్"  ప్రభుదేవా, అదాశ‌ర్మ, నిక్కీ గ‌ల్రాని హీరో హీరోయిన్లుగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శక‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామా పిక్చర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్పణ‌లో వి.శ్రీనివాస‌రావు తెలుగులోకి ‘ంర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దిస్తున్నారు. త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం అక్కడ భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప్రస్తుతం తెలుగు అనువాద కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల‌లోనే సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి చూస్తున్నారు. 

సోమవారం ‘ంర్ ప్రేమికుడు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన నిర్మాత వి.శ్రీనివాస‌రావు సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ప్రభుదేవా హీరోగా న‌టించిన సినిమాలంటే అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన‌ అభిమానం. అందుకే తెలుగులోకి అనువ‌దిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిల‌వ‌నున్నాయి. త్వర‌లో ఆడియోను విడుద‌ల చేసి ఈ నెల‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి అమ్రీష్ సంగీతం సమకూర్చారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు.