నో.. చెప్పేశాడు..

01:11 - August 18, 2018

               ఒక్క సినిమాతో జాతీయస్థాయితో పాటు  ప్రపంచ స్థాయి సినిమాను ఆకర్షించాడు రెబల్ స్టార్ ప్రబాస్. సినిమాకోసం టూ, త్రీ ఇయర్స్ వేరే సినిమాలు ఒప్పుకోకుండా బాహుబలికి అంకితం అయ్యాడు. అయితే బాహుబలి క్రెడిట్ వలన ప్రభాస్ కు వచ్చిన ఓ గోల్డెన్ ఛాన్స్ ను వద్దనుకున్నాడు ప్రభాస్. 
          బాహుబలి తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్ నటన, పోరాటాలకు బాలీవుడ్ అభిమానులు సైతం ఫిదా అయ్యారు. హాలీవుడ్ స్థాయి పోరాట సన్నివేశాలు.. భారి సెట్టింగ్ లు, మంచి కథ, తో పాటు ప్రభాస్ నటన, ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు.. దాంతో ఆయన ఇమేజ్ ఒకే సారి పెరిగిపోయింది.  బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచన చాలా మంది  బాలీవుడ్ దర్శక నిర్మాతలకు వచ్చింది. అంతే కాదు కొంత మంది సినిమా ప్రపోజల్స్ కూడా పెట్టారట..
           బాహుబలి తర్వాత డైరక్టర్  సంజయ్ లీలా భన్సాలీ ప్రభాస్ కు ఓ గోల్డెన్ ఆఫర్  ఇచ్చాడట.. ఆయన  తెరకెక్కించిన పద్మావత్ ఈమూవీ సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో  ఓ  ప్రత్యేక క్యారెక్టర్ కోసం ప్రభాస్ ను బన్సాలీ సంప్రదించాడట. కానీ ఈ ఆఫర్ ను ప్రభాస్ రిజెక్ట్ చేసాడని తాజాగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. సంజయ్ లీల భన్సాలీ డైరక్షన్ లో దీపికా పదుకొనె హీరోయిన్ గా వచ్చిన పద్మవత్ కి ఫస్ట్ ఐశ్వర్య రాయ్ ని కూడా అడిగారట. కానిదీపికను ఫైనల్ చేశారు. ఇలాంటి భారీ మూవీలో రాజా రావల్ సింగ్ పాత్ర కోసం భన్సాలీ ప్రభాస్ ని అడిగారట. కాని ప్రభాస్ రిజక్ట్ చేయడంతో  షాహిద్ కపూర్ ని భన్సాలీ ఎంపిక చేసుకున్నాడు.