టాలీవుడ్ ని వదిలేయనున్న స్టార్ బ్యూటీ?: బాలీవుడ్ వైపు మళ్ళీ....

12:08 - January 8, 2019

దాదాపుగా టాలీవుడ్ లో నంబర్ వన్ అనిపించుకున్న ప్రతీ హీరోయిన్ తర్వాతి గోల్ బాలీవుడ్ లో అడుగు మోపటమే. అయితే అప్పటిదాకా కూదా సమయమ తీసుకోకుండా కెరీర్ ఆరంభం లోనే ఒక మంచి ఆఫర్ కొట్టి బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయిన భామలూ ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో పూజా హెగ్డే కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ శెట్టి ఇటీవలే ‘సింబా’ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న రోహిత్ శెట్టి తన తర్వాతి చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో చేయబోతున్నాడు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇక అక్షయ్ కుమార్ కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇలియానా తో "రుస్తోం" లాంటి హిట్ ఇచ్చిన అక్షయ్ టాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్లు అంటే కాస్త అసక్తి చూపిస్తున్నాడు. సో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని దాంతో బాలీవుడ్ లో పూజా హెగ్డే బిజీ అవ్వనుందని అలా టాలీవుడ్ ను పూజా వదిలేస్తుందేమో అనిపిస్తుంది.

తెలుగులో ‘ముకుంద’ ‘ఒక లైలాకోసం’ చిత్రాల్లో నటించి ఒక చిన్న తరహా హీరోయిన్ గా పరిచయం అయిన  పూజా ఆ తర్వాత ఊహించటానికి ఏకంగా ఒక బంపర్ ఆఫర్  ‘మొహెంజదారో’  తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే  హృతిక్ లాంటి హీరోతో కావటంతో పాపం పూజా ఆశలన్నీ చల్లబడ్డాయి. మొహంజో దారో సినిమా సక్సెస్ కాకపోవడం, పూజా నటనకి కూడా పెద్దగా గుర్తింపు రాకపోవటంతో మళ్ళీ తెలుగులో ‘డీజే’ చిత్రంతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అందాల ప్రదర్శణతో పాటు ఫుల్ ఎనర్జిటిక్ నటనతో ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత తెలుగులో పూజా హెగ్డే లక్కీబ్యూటీగా పేరు దక్కించుకుంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ చిత్రంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్తో తో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లోనూ బుక్ అయ్యింది. 

అయితే ఇని అవకాశాలు టాలీవుడ్ నుంచి వస్తున్నా.. పూజా చూపు మాత్రం ఇంకా బాలీవుడ్ మీదనే ఉంది.  ఇప్పుడు అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాలో బుక్ అయి అక్కడ ఆ సినిమా గనక హిట్ అయ్యిందంటే పూజా ఇక టాలీవుడ్ వదిలేసేఆలోచనలో ఉన్నట్టు సమాచారం.