ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ : లోక్ సభ బరిలోకి ఖమ్మం నుంచి పోటీ??

00:23 - February 6, 2019

"అమేథీ" ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ నియోజకవర్గం నుంచే రాహుల్ గాంధీ పోటీ చేస్తూ వస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రాహుల్ తెలంగాణాలోని ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ఆలోచన మామూలు జనాలకి రాకముందే పొంగులేటి సుధాకర్ రెడ్డికి వచ్చింది. ఆయన స్వయంగా రాహుల్ ని అడిగేశారు కూదా.

మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని న్యూఢిల్లీలో తెలంగాణా కాంగ్రేస్ నాయకులు రాహుల్ గాంధీ ని కలిశారు. ఇదే సందర్భంలో  ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి  రాహుల్ గాంధీని కోరారు. దీనికి రాహుల్ నవ్వుతూ "చూద్దాం..లే" అని సమాధానం చెప్పారు. 
ఆతర్వాత పొంగులేటి మాట్లాడుతూ సమన్వయ లోపం కారణంగానే ఓడామన్న ఆయన టీడీపీతో పొత్తు దెబ్బతీసిందనీ. రాష్ట్ర పార్టీకి పూర్తి స్వేచ్ఛనిస్తే ప్రాంతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోగలమన్నారు. 
ఇక సుధీర్ రెడ్డి కూదా పార్టీలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండాల్సిన అవసరం లేదని  రాహుల్‌కు తెలిపారు. దీని వల్ల నష్టమే కానీ లాభం లేదని ఆయన కాంగ్రెస్ అధినేతతో చెప్పారు. ఉపాధ్యక్ష పదవులను అర్హత లేని వారికి ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిక్కెట్లు ఇవ్వడంలో జాప్యం వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసిందని, అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుండేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయ పడ్డారు, అంతే కాదు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా టీఆర్ఎస్‌కు కలిసి వచ్చాయన్నారు. ఇలా కాంగ్రేస్ నేతలంతా రాహుల్ గాంధీతొఈ మాట్లాడుతూ తమ అభిప్రాయాలనీ, సూచనలనీ తెలియజేశారు. 

నిజానికి ఖమ్మం నుంచి పోటీ చేయకున్నా, అమేథీలో మాత్రం ఈ మధ్యనే రాహుల్ కి ఊహించని వ్యతిరేకత కనిపించింది. గత నెలలో అమేథి జిల్లాలోని గురిగంజ్ పట్టణంలో రాహుల్ పర్యటిస్తుండగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. అంతే కాదు రాహుల్ గాంధీ పని విధానంతో తాము తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలిపారు. ఆయన తప్పకుండా ఇటలీకి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేశారు. తమ కోరికలను రాహుల్ నెరవేర్చడం లేదన్న రైతు ఒకరు తమ భూములను రాహుల్ లాక్కున్నాడని ఆరోపించాడు. ఈ పరిణామాలతో రాహుల్ ఖమ్మం వచ్చేస్తే? ఏమో పొంగులేటి గుర్రం ఎగరావచ్చు...