మోడీ గుంటూరు పర్యటన ఈరోజే: పూర్తీ షెడ్యుల్

01:44 - February 10, 2019

*ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ  పర్యటన వివరాలు

* రెండు కీలక ప్రాజెక్టులు జాతికి అంకితం

* 1700 మంది పోలీసులతో బందోబస్తు 

 

 

ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చాక ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాని మోడీ తొలి  పర్యటన ఇదే. ఆదివారం ఉదయం 11:15కు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడికి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.బహిరంగసభలో ప్రసంగించటానికి ముందుగా సభా ప్రాంగణంలోనే ప్రత్యేక వేదికపై ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పర్యటనలో భాగంగా రెండు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు.  మోదీ సభా ప్రాంగణానికి ఉదయం 11.10 గంటలకు చేరుకుంటారని  తెలిపాయి. ప్రధాని సభకు 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు  డీజీ రవిశంకర్‌ అయ్యర్‌ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.  మోదీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. 

*ఉదయం 10.45గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో గుంటూరుకు బయలుదెరుతారు
*  11.05 గంటలకు గుంటూరు చేరిక 
* 11.15గంటలకు గుంటూరు బైపాస్‌లోని ఏటుకూరు చేరిక (బహిరంగ సభ వేదిక) 
*  11.15 నుంచి 11.20వరకూ ప్రాజెక్టులపై స్వల్ప ప్రసంగం 
* 11.20 నుంచి 11.25లమధ్య కృష్ణపట్నంలో నిర్మించనున్న బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్‌కు శంకుస్థాపన, విశాఖపట్నంలోని ఓఎన్జీసీ వశిష్టవ్, ఎస్1 డెవలెప్‌మెంట్ ప్రాజెక్టులు ఈఓఏ, ఎస్పీఆర్ ఫెసిలిటీ జాతికి అంకితం 
*11.25కు తిరిగి గుంటూరుకు పయనం 
*11.30 నుంచి 12.15: గుంటూరులో బహిరంగ సభలో ప్రసంగం 
* 12.30 బహిరంగ సభ వేదిక నుంచి విజయవాడకు బయలుదేరుతారు
*మధ్యాహ్నం 12.50: విజయవాడ ఎయిర్‌పోర్టుకుచేరుకుని అక్కడినుంచి డిల్లీకి పయనమవుతారు.