అభాసు పాలైన మోడీ తెలుగు ప్రసంగం: తిక్కనది గుంటూరు అంటూ....

12:35 - February 10, 2019

*తెలుగులో ప్రసంగం ప్రారంభం 

* అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు

*అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్

 

 

ప్రాంతీయ భాషల్లో మాట్లడి స్థానికి ప్రజలని ఆకట్టుకోవటం ఎంత ముఖ్యమో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మొడీకి కూడా అర్థమైనట్టే ఉంది. గతంలో సోనియా గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో పలకరింపులవరకూ మాత్రమే మాట్లాడేది కానీ ఈసారి మోడీ మాత్రం తన ఎప్పటి మాదిరే మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.  ముఖ్యంగా తనతరహా పొగడ్తలని ఆయన మర్చిపోకుండా బాగానే సోప్ వేశారు.గుంటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ఆయన తొలిగా ప్రసంగం చేసి, అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు.


  "ఏపీ అక్షర క్రమంలో తొలిస్థానంతో పాటు అన్ని రంగాలలో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు" అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోడీ  "పద్మభూషణ్, దళిత కవి గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం" అంటూ స్థానిక మహా పురుషులని కూడా కలుపుకుంటూ జనాలని తన మాటలలో పడేసారు.’  అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే మధ్యమధ్యలో వావిలాల గోపాలకృష్ణయ్య, డాక్టర్ నాయుడమ్మను కూడా ప్రధాని ప్రస్తావించారు. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలమీద తాను ఎంత శ్రద్దగా ఉన్నానో అనే భావన కలిగేలా చేయాలన్న ఆలోచన బాగానే  ఉంది గానీ, ప్రధానికి ప్రసంగం   రాసిచ్చిన వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటంటే తిక్కన పుట్టింది గుంటూరు జిల్లాలో అని తప్పు ఇంఫర్మేషన్ ఇవ్వటం, కవి తిక్కన కాదు నెల్లూరు జిల్లా కోవూరులో. అయితే ఈ విషయం తెలియని ప్రధాని గారు మాత్రం తిక్కన ని కూడాక్కడే గుంటూరుకు మార్చేసారు. పాపం ఆయనకి ఏం తెలుసు చెప్పింది విని చదివేయటం తప్ప 

ఇక మనుషులనుంచీ ఆ ప్రాంతాన్ని కూడా పొగుడుతూ "ఎంతోమంది ప్రముఖులను జాతికి అందించిన గడ్డ గుంటూరు అని, అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్" అని ప్రధాని వ్యాఖ్యానించారు. గుంటూరు సమీపంలో ఉన్న అమరావతికి ఎంతో చరిత్ర ఉందని, ఇప్పుడు అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా ఎదుగుతుందని అన్నారు. అమరావతిని హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. మీరు నాపై చూపిస్తున్న ఎంతో ప్రేమ నిరంతరం పనిచేసేలా తనకు ప్రేరణ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభా స్థలి నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 


అయితే డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, డీజీపీ ఆర్పీ ఠాకూర్, కామినేని శ్రీనివాస్ తదితర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అందరికీ సాదరంగా పలకరించిన మోదీ అనంతరం హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులెవరూ మోదీకి స్వాగతం పలికేందుకు రాకపోవటం గమనార్హం.