పాయల్‌ జోరు చూస్తుంటే...

15:57 - January 4, 2019

ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో అసాధారణ పాపులారిటీ తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ పంజాబీ బ్యూటీ అందచందాలకు యూత్ ఫిదా అయిపోయారు. ఆర్ఎక్స్ 100 గ్రాండ్ సక్సెస్ పాయల్ జాతకమే మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్ లోనూ పాయల్ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉదయనిధితో కలిసి ఆన్ లొకేషన్ ఈ బ్యూటీ చేస్తున్న సందడి మామూలుగా లేదు. తమిళ చిత్రం ఏంజెల్ షూటింగ్ తో బిజీ అంటూ పాయల్ తాజాగా ఓ వీడియోని ఇన్ స్టాగ్రమ్లో అప్ లోడ్ చేసింది. హాయ్ ఉదయ్.. షూటింగ్ ఫర్ ఏంజెల్! అంటూ ఛీర్స్ చేసింది. మొత్తానికి పాయల్ జోరు చూస్తుంటే ఇప్పట్లో ఎక్కడా తగ్గేట్టే కనిపించడం లేదు. భానుశంకర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో పాయల్  నటించనుంది. అంతేకాదు ఎన్టీఆర్‌ - కథానాయకుడు చిత్రంలో జయసుధ పాత్రలో పాయల్ నటిస్తోంది. ఇరువార్ ఉల్లమ్ అనే తమిళ చిత్రంలో ఇష్కా అనే పంజాబీ చిత్రంలోనూ పాయల్ నటిస్తోంది. ఇప్పటికే పంజాబీలో అరడజను చిత్రాల్లో నటించిన మేటి కథానాయికగా వెలిగిపోతోంది పాయల్.