జొన్నన్నం, పచ్చిమిరపకాయ్ : జనం మధ్య జనసేనాని భోజనం

22:55 - March 24, 2019

*తాటి చాప, జొన్న అన్నం, పచ్చిమిరపకాయ 

*కృష్ణా జిల్లా ప్రచారంలో ఆకట్టుకున్న జనసేనాని భోజనం 

*సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు 

 

 

 

 

 

మనదేశం లో ఎన్నికల ప్రచారం తీరే వేరు ఎప్పుడూ జనం మధ్యన కనిపించని నాయకులు ఎన్నికల సమయం లో మాత్రం జనం మామూలుగ చేసుకునే పనులను కూడా ఫొటోలకోసం చేస్తూనే ఉంటారు. అయితే అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొందరు మాత్రం తమకంటూ ఒక ప్రత్యేక శైలిలో కనిపిస్తూంటారు. ఎక్కడా నటన కనిపించకుండా సామాన్య జనంలో భాగమైపోతారు. ఒక నాడు ఎన్టీఆర్ చైతన్య రథం మీద చేసిన యాత్రలో భాగంగా ఆయన జీవించిన తీరూ ఆతర్వాత వయ్యెస్సార్ మహా పాదయాత్రలో పాల్గొన్న తీరూ ఎంతగా ప్రజల్లో వాళ్ళంటే నమ్మకాన్ని కలిగించాయో కొత్తగా మనం చెప్పే పని లేదు. రాష్ట్ర రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన ఘట్టాలు అవి.

ఇక మళ్ళీ ఇన్నాళ్ళకు అలా ఇతనూ మాలో ఒక భాగమే అని జనం అనుకునేంత దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కూడా ఆతరహాలోనే తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. నిజానికి పవన్ రాజకీయాల్లోకి రాకముందు కూడా రోడ్డు మీద కనిపించే దాబాల్లో టీ తాగటం, ఖరీదైన బట్టలు కాకుండా మామూలుగానే జనంలో కలిసిపోవటం వంటి పనులే ఆయనని అటు అభిమానులకూ, రాజకీయాల్లోకి వచ్చాక జనసేనలో చేరుతున్న మామూలు జనాలకూ దగ్గర చేసాయి. ఇప్పుడు ప్రచారంలో భాగంగా పంచెకట్టుకొని మరీ తిరుగుతున్న పవన్ అత్యంత సాధారణంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమా నటనా అని ఆలోచించేకంటే జనాన్ని ఆకట్టుకుని వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నం అని మాత్రం అనుకోవచ్చు. 


 అందుకే పవన్ ఎన్నికల ప్రచారమే కాదు ప్రచారం తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్న తీరు కూడా ఆకట్టుకుంటోంది. శనివారం తన వాహనం డిక్కీ భాగంలో కూర్చొని టీ తాగుతూ సేద తీరారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేనాని. అనంతరం చెట్టు కింద తాటి చాప వేసుకొని కూర్చుని. మట్టి గిన్నెలో జొన్న అన్నాన్ని మజ్జిగలో కలుపుకొని తిన్నారు. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ నంజుకుంటూ. ఆయన భోజనాన్ని ఆస్వాదించారు. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద జనసేనాని ఇలా ఆస్వాదిస్తూ భోజనం చేశారు. మొత్తానికి వచ్చే సభల్లో మళ్ళీ జొన్నన్నం, పచ్చిమిరపకాయ కూడా తిన్నాను అని గ్లోరిఫై చేసుకోకుంటే చాలు. ఈ తరహా పనులుల్లో నిజాయితీని జనం గమనిస్తునే ఉంటారు కాబట్టి పాజిటివ్ గా తీసుకుంటారు.