అజ్ఞాతవాసి దారెటూ...?

14:13 - January 27, 2019

రీల్‌ లైఫ్‌లోనే కాదు...పొలిటికల్‌ లైన్‌లోనూ..పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ స్టారేనా? రేపటి ఏపీ పొలిటికల్‌ వార్‌లో పవర్‌ పాలిట్రిక్స్‌ తన చుట్టే తిరగనున్నాయా..? సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కూడా పవన్‌ మద్దతు కోరుతుందా...? ఇంతకీ జనసేనా అంతరంగం ఏమిటి? అజ్ఞాతవాసి పొలిటికల్‌ దారెటూ...?

 
              ఏపీలో పవన్‌ ఎవరి పక్కన ఉంటే... వారిదే పవరా...? అవుననే చెప్పాల్సి వస్తుంది. గత కొంతకాలంగా జరుగుతున్న పొలిటికల్‌ డిబేట్‌ తాజాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ ఇచ్చిన తేనేటివిందు రాజకీయాల్లో జనసేన ఎవరి సైడ్‌ ఉండబోతుంది అనేది మరోసారి తెరమీదకు వచ్చింది. ఓ వైపు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణం కావడంతో జనసేన దారెటు...అనే టాపిక్‌...ఇంట్రెస్టింగ్‌గా మారింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ ఇచ్చిన తేనేటివిందులో పవన్‌ సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలచేలా చేసింది కూడా ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాయి... పవన్‌ కళ్యాణే కింగ్‌ మేకర్‌ కావడం. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల భేటీ, గవర్నర్‌ గంటసేపు విడివిడి మంతనాలు జరిపారు. ఇంతకుముందే...తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ల కలయికపై విరుచుకుపడ్డ జనసేన మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి మరి. అయితే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎంట్‌హోంలో జరిగిన పలకరింపులన్నీ మర్యాదపూర్వకంగా జరిగినవే తప్పా...అందులో రాజకీయాలేమీ లేవన్నారు. అంతేగాక ఇప్పటికీ జనసేన అధినేత పవన్‌ సిపిఎం, సిపిఐలతో కలిసి పోటీ చేయనున్నట్లు కూడా స్పష్టత ఇచ్చారు. అయితే టిడిపి మాత్రం జనసేనను తమవైపు తిప్పుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు సమాచారం. అందుకే ఆ పార్టీ నేత టిజి వెంకటేష్‌ పవన్‌తో పోటీ చేస్తే తప్పేంటి..? అన్నారు. దీనిపై పవన్‌ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేనకు మధ్య పొత్తు పొసిగే అవకాశం లేదని తేలిపోయింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో పవన్‌ను లాగేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గవర్నర్‌ ఇచ్చిన తేనేటి విందులో పవన్‌తో భేటీలో ఆంతర్యం అదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్‌ మాత్రం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, ఆ తర్వాత ఏ పార్టీతో వెళ్లేది నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారట. అదే జరిగితే పవన్‌ ఎవరిసైడ్‌ ఉంటే...వారిదే ఏపీలో పవర్‌...