పవన్‌ తరుపున బన్నీ ప్రచారం చేయడం కష్టమేనట!

14:02 - April 9, 2019

జనసేన పార్టీకి లేఖలు విడుదల చేసి బహిరంగ మద్దతు పలికిన మెగా హీరో అల్లు అర్జున్.. కానీ పవన్ నాగబాబు కోసం మాత్రం నియోజకవర్గాల్లో దిగి  ఫిజికల్ గా ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల బన్నీ పవన్‌ని కలుసుకోవడానికి రాజమండ్రి పయనం అయ్యాడు. అయితే అక్కడ పవన్‌ తరుపున ప్రచారం చేస్తాడా...అంటే కష్టమేనన్నట్లుగా సమాచారం వుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగిన అల్లు అర్జున్‌కి పవన్‌ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాగా బన్నీ పవన్‌ని కలుసుకోని పరామర్శించనున్నారు. అయితే పవన్ కళ్యాన్ తరుఫున అల్లు అర్జున్ భీమవరంలో ప్రచారం చేసే అవకాశాలైతే కనిపించడం లేదని కానీ...నాగబాబుతో కలిసి నర్సాపురం పరిధిలో తిరిగి ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. నిన్ననే రాంచరణ్ ప్రచారానికి రాగా పవన్ అనుమతించారు. ఇప్పుడు బన్నీ కూడా వస్తుండడంతో జనసేన పార్టీకి ఫుల్ జోష్ వచ్చేసింది. అయితే మరో ఎండ్ లో మాత్రం మెగా హీరోలు ఇలా చివర్లో రావడంపై అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ప్రచారం ముగిసే రోజున ఇలా రావడం జనసేనకు హెల్ప్ అవుతుందా అని మథనపడుతున్నారు.