పంచాయితీ ఎన్నికలు: తెలంగాణలో ఈ రోజు మొదలైన తొలి విడత పోలింగ్‌

10:57 - January 21, 2019

రాష్ట్రంలో తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు (సోమవారం) ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మ.2గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. అనంతరం ఫలితాల వెల్లడిస్తారు. 3,701పంచాయతీలకు 12,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.