మీ నీళ్ళు మీరు ఏమైనా చేసుకోండి, మాకు అనవసరం : నీళ్ళ మళ్లింపు పై పాక్ ప్రతిస్పందన

21:10 - February 22, 2019

*మీ తూరుపు  నీళ్ళు మీరు ఏమైనా చేసుకోండి, మాకు అనవసరం

*సింధూ జలాల  మళ్లింపు పై పాక్ ప్రతిస్పందన   

*మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆందోళన అంతకంటే లేదు

 

పాక్‌పై భారత్ 'జలాస్త్రం' ప్రయోగించాలని తీసుకున్న తాజా నిర్ణయంపై పాక్ శుక్రవారంనాడు స్పందించింది. భారత్‌ వాటాకు చెందిన రావి, సట్లెజ్, బియాస్ నదీ జలాలు పాకిస్థాన్‌‌‌కు ప్రవహించకుండా సొంత రాష్ట్రాలకే మళ్లించున్నంత మాత్రన తమ దేశానికి వచ్చే నష్టమేమి లేదని, తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని పాక్ ఉన్నతాధికారి ఒకరు తాజాగా వ్యాఖ్యానించారు. "తూర్పు నదుల్లోని మన వాటా నీటిని ఇక నుంచి పాక్‌కు వదలకుండా పంజాబ్, కశ్మీర్, పంజాబ్‌లలోని నీటి అవసరాలకు మళ్లిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే"   

"సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు జలాల్లోని నీటిని భారత్ మళ్లించుకుని అక్కడి ప్రజల అవసరాలకు వాడుకున్నా, లేదంటే వారికి నచ్చినట్టు మరో విధంగా ఉపయోగించుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆందోళన అంతకంటే లేదు" అని పాక్ జలవనరుల శాఖ సెక్రటరీ ఖవాజా షువాలీ వ్యాఖ్యానించినట్టు పాకిస్థాన్ లోని "డాన్" పత్రిక తెలిపింది. అయితే, తమకు హక్కులున్న పశ్చిమ జలాల (చినాబ్, సింధు, జీలం)ను వాడుకున్నా, మళ్లించినా తప్పనిసరిగా పాక్ వ్యతిరేకంచడంతో పాటు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తుందని షువాలీ తెలిపారు. 


సింధూ జలాల ఒప్పందం-1960 ప్రకారం తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్ జలాలను వాడుకునేందుకు భారత్‌కు హక్కుంది. పశ్చిమ నదులు సింధూ, జీలం, చినాబ్ జలాలను పాకిస్థాన్ వాడుకోవచ్చు. ఐతే భారత్‌కు హక్కున్న నదీ జలాలను భారత్ సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఆ నీటిని పాకిస్థాన్ వాడుకుంటోంది. కాగా, పుల్వామా దాడి అనంతరం భారత్ తమకు హక్కున్న నీటిని పాక్‌కు ఇవ్వకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా పాక్ కి అదనంగా అందుతున్న జలాలని అడ్డుకునే హక్కు ఉందే తప్ప పాక్ కి హక్కులున్న పశ్చిమ నదులని భారత్ అడ్డుకోవటం నిబందనల ప్రకారం కుదరదు.  అయితే అన్నిటికంటే కొసమెరుపు ఏమిటంటే ఆ నీటిని మళ్లించేందుకు 100 మీటర్ల ఎత్తైన డ్యామ్ నిర్మిస్తుండడంతో ఈ ప్రక్రియ పూర్తవడానికి ఆరేళ్లు పట్టవచ్చని తెలిపారు.